26.7 C
Hyderabad
May 15, 2024 09: 58 AM
Slider ముఖ్యంశాలు

అగ్నిపథ్ పై కొల్లాపూర్ కాంగ్రెస్ సత్యాగ్రహం

#jagadeeswar

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపత్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతలపల్లి జగదీశ్వర్ రావు నేడు  సత్యాగ్రహ దీక్ష నిరసన కార్యక్రమం నిర్వహించారు. కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో కొల్లాపూర్ మండల అధ్యక్షులు పరుశరామ్ నాయుడు ఆధ్వర్యంలో ఈ నిరసన సత్యాగ్రహ దీక్ష ఏర్పాటు చేశారు.

కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగదీశ్వర్ రావు ముందుగా అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. ఈ సదర్భంగా  జగదీశ్వర్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపత్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఈ పథకం విషయంలో నరేంద్ర మోడీ మొండిగా వ్యవహరించి ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పడం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు.

రాష్ట్రంలో అగ్ని పథకానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన ఆర్మీ జవాన్ సోదరులను అక్రమంగా అరెస్టు చేయడం కెసిఆర్ ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం తో లోపాయికారిగా ఒప్పందంలో భాగమే అని అన్నారు. అగ్నిపత్ పథకంలో భాగంగా త్రివిధ దళాల లో చేరాలనుకునే వారిని 4 సంవత్సరాలు వాడుకుని ఉద్యోగం నుంచి తొలగిస్తే వారు బయటకు వచ్చి ఏం చేయాలని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలబడి,ఈ అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేసేంతవరకు పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాహుల్ గాంధీ అగ్నిపత్ పథకాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రెటరీ రంగినేని జగదీశ్వర్, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కేతూరి వెంకటేష్, టీపీసీసీ రాష్ట్ర మహిళా కార్యదర్శి కాటామోని తిరుపతమ్మ గౌడ్, నాగర్ కర్నూల్ జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు రాము యాదవ్, కొల్లాపూర్ బి బ్లాక్ అధ్యక్షులు కాటామోని కృష్ణయ్య గౌడ్ పాల్గొన్నారు.

ఇంకా జిల్లా కార్యదర్శి కంటే శివన్న, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సిరాజ్, జిల్లా సేవాదళ్ కార్యదర్శి రఫీదీన్, కొల్లాపూర్ తాలూకా రేవంత్ మిత్ర మండలి అధ్యక్షులు DK మాదిగ, వనపర్తి జిల్లా పార్టీ కార్యదర్శి బుసిరెడ్డిపల్లి కృష్ణ, కొల్లాపూర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దాసరి ఉదయ్ యాదవ్, కొల్లాపూర్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శివప్రసాద్,పరశురామ్ నాయుడు, టౌన్ అధ్యక్షులు కాంతారావు, పాన్గల్ మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, కోడేరు మిద్దె శాంతయ్య, పెద్దకొత్తపల్లి  మండల పార్టీ ప్రెసిడెంట్ తగిలి కృష్ణయ్య పాల్గొన్నారు.

వీరితో బాటు చిన్నంబావి మండల అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్, పెంట్లవెల్లి మండల అధ్యక్షులు నర్సింహా యాదవ్, కోడేరు మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీరపాగా కిరణ్ కుమార్, చిన్నంబావి మండల కిసాన్ సెల్ అధ్యక్షులు పుల్లారెడ్డి, పాన్గల్ మండలం కిసాన్ సెల్ అధ్యక్షులు జగదీష్ రెడ్డి, పెంట్లవెల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గోవు రాజు, కోడేరు మండల యూత్ అధ్యక్షులు పుట్ట రాముడు, పెంట్లవెల్లి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నర్సింహా నాయుడు,కొ ల్లాపూర్ మండల యూత్ అధ్యక్షులు సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు.

మౌలాలి, కొల్లాపూర్ టౌన్ యూత్ అధ్యక్షులు కురుమయ్య, కోడేర్ మండల యూత్ కాంగ్రెస్ ఉపాఅధ్యక్షులు చెన్నకేశవులు, కొల్లాపూర్ టౌన్ యూత్ ఉపా అధ్యక్షులు బాబా,వీపనగండ్ల మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ భాస్కర్ రెడ్డి, పెంట్లవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రామకృష్ణ గౌడ్, పెంట్లవెల్లి టౌన్ అధ్యక్షులు మన్నన్, పెంట్లవెల్లి MRPS అధ్యక్షులు రాముడు, గొప్లాపూర్ గోపాల్,రాముడు, సర్పంచ్ మానసవిష్ణువర్ధన్ రెడ్డి, ముష్టిపల్లి గ్రామ ఎంపిటిసి ఖాజా,కొల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు జంగం శివానందం ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారిలో ఉన్నారు.

వీరితో బాటు పుట్టపాగా రాముడు,మల్లేశ్వరం కురుమయ్య, సంపంగి నర్సింహా, శీలం వెంకటేష్,నడిమింటి వెంకట్ స్వామి గారు,బెట్టారి నాగయ్య గారు,కోడేరు గ్రామ పార్టీ అధ్యక్షులు ఎల్లారెడ్డి గారు,పాన్ గల్ మండల నాయకులు సుధాకర్ యాదవ్, మాజీ సర్పంచ్ ఆదిచంద్రయ్య, కేతేపల్లి స్వామి, చిన్నంబావి నాయకులు రాజవర్ధన్ రెడ్డి,మాజీ సర్పంచ్ ఖాదర్ యాదవ్, రమణ రెడ్డి, కోడేరు మండల SC సెల్ అధ్యక్షులు పసుపుల నాగేంద్రం, మాజీ ఉపా సర్పంచ్ నరేందర్ గౌడ్ కూడా పాల్గొన్నారు.

ఇంకా చిన్నంబావి మండల యూత్ కోఆర్డినేటర్ రవివర్మ, పాన్గల్ మండల యూత్ కోఆర్డినేటర్ నగేష్ నాయక్, విపనగండ్ల మైనారిటీ అధ్యక్షులు సుల్తాన్, బొల్లారం స్వామి, పెద్దకొత్తపల్లి సేవాదళ్ అధ్యక్షులు ఆరెపల్లి శ్రీను, నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు,యూత్ కాంగ్రెస్ నాయకులు,కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడిస్తాం

Satyam NEWS

తదుపరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ చంద్రచూడ్

Satyam NEWS

ఉస్మానియా వైద్యులకు మంత్రి హరీష్ రావు అభినందనలు

Satyam NEWS

Leave a Comment