27.7 C
Hyderabad
May 15, 2024 06: 51 AM
Slider విశాఖపట్నం

విశాఖ ఉక్కు అమ్మేస్తున్న బీజేపీ కి మద్దతు ఇవ్వడం సిగ్గు చేటు

#vizagsteels

విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని అంటూ నినదించి నాడు పోరాటం చేసిన నాటి హక్కులను కాలరాస్తున్న మోడీ ప్రభుత్వానికి రాష్ట్ర పతి అభ్యర్థి విషయం లో రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం మద్దతు పలకడం బాగోలేదని వామపక్ష సంఘాలు విమర్శించాయి.

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం 500 రోజులు అయిన సందర్భంగా విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎన్టియూసి, ఐఎఫ్టియూ కార్మిక, విద్యార్థి, యువజన సంఘాలు ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కలెక్టరేట్ దగ్గర నిరసన ధర్నా చేపట్టి స్పందనలో వినతిపత్రం అందజేయడం జరిగింది.

అనంతరం ఏఐటీయుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్, సీఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టి.వి.రమణ, ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షుడు మోదిలి శ్రీనివాసరావు లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ని కారుచౌకగా అమ్మేస్తున్నా రాష్ట్రపతి ఎన్నికల్లో పిలవకుండా బీజేపీ కి మద్దతు నిజంగా సిగ్గు చేటు అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

మీ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తుని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెడతారా అని ప్రశ్నించారు. 500 రోజులుగా స్టీల్ ప్లాంట్ కోసం కార్మిక సంఘాలు కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నారని అన్నారు.

నాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించి వామపక్ష పార్టీలు ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు ద్వారా పదవులను వదులుకుని, 32 మంది కార్మికులు బలిదానం చేసి త్యాగం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ..ప్రస్తుతం మోడీ ప్రభుత్వరంగ సంస్థలని విదేశీ, స్వదేశీ కార్పొరేట్ సంస్థలకి కారుచౌకగా ధారాదత్తం చేయడం దుర్మార్గం అని ఆవేదన వ్యక్తంచేశారు.

ఇప్పటికైనా మొండి వైఖరి విడనాడకపోతే ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని రాష్ట్రంలో ప్రజల ఆస్తులు ఉక్కు, రైల్వే, ఓడరేవులు, ఎల్ఐసి, విమానాలు, బీఎస్ఎన్ఎల్ మొదలైన వాటిని అమ్మకుండా కాపాడుకుంటామని అందుకు రానున్న కాలంలో కార్మిక సంఘాలను కలుపుకొని పెద్దఎత్తున ఆందోల్ నిర్వహిస్తామని వారన్నారు

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్.రంగరాజు, జిల్లా కార్యదర్శి కె.వి.రమణ, శ్రీనివాస్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బి.వాసు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెలగాడ రాజేష్, సిఐటియు నాయకులు జగన్మోహన్, సురేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రేమ నిరాకరించిందని క్రూరంగా చంపేసిన ప్రేమికుడు

Satyam NEWS

సాక్షి భావనారాయణ స్వామి భూములు ఇవ్వద్దు

Satyam NEWS

ఇప్పటికైనా వెన్నెముక ఆధారంగా నిటారుగా నిలబడతారో లేదో??

Satyam NEWS

Leave a Comment