31.7 C
Hyderabad
May 7, 2024 02: 05 AM
Slider సినిమా

జులై 20.. ‘బాలు’ గారి ఫోన్…

#KadambariKiran

“కాదంబరీ..’మనం సైతం’ పేరుతో చాల మంచి పనులు చేస్తున్నారు!

చాల చాల గొప్పగా మీగురించి వింటున్నాను. చిన్నపాటి గర్వంగా ఉంది” అన్నారు!!

“అన్నయ్యా.. మీ వరకు ‘మనం సైతం’ చేరటం నా అదృష్టం”

సంబరంగా అన్నాను నేను.

“మీ గోల్ ఏమిటి” అని అడిగారు బాలు.

‘సపర్య.. we Care for uncared’

నా మదిలో మెదిలే ఆశ్రమ స్థాపన గురించి క్లుప్తంగా వివరించాను.

“నేను మీ వెంట ఉంటున్నాను. ముందు

‘మనం సైతం’ బ్యాంకు డీటెయిల్స్ పెట్టండి”అన్నారు బాలు.

SP చరణ్ ని సింగర్ గా నేనే పరిచయం చేసినప్పటికీ (‘కుర్రాళ్ళరాజ్యం’ చిత్రంతో) బాలుగారితో నాకు సన్నితత్వం అంతంత మాత్రమే.

అదే మాట ఆయనతో అంటే..

“మీ గురించి పూర్తిగా నాకు తెలుసు సోదరా” ప్రేమగా అన్నారాయన.

అప్పటికి చాన్నాళ్ల క్రితమే..

ఒక మిత్రుడిని నా ఫోన్ నెంబర్ అడిగారట. మిత్రుడు కదా వెంటనే చెప్పలేదు!!

కాసింత లేటయ్యింది అనుకున్నా గానీ..

మరీ ఇంత లేట్ అవుతుందనుకోలేదు.

బాలు సర్.. మీ ఆశీస్సులు

‘మనం సైతం’ గుండెలపై నిండుగా రాసున్నాయ్.

అవి చెరిగిపోవు… ఏనాటికీ..!!!

మీ పాట సాక్షిగా….

చెమరిన గుండెలతో..

మనం సైతం

Related posts

(Over-The-Counter) Do Male Enhancements Work Rhino 7 Male Enhancement Directions

Bhavani

‘పెద్దల’ ఆశీస్సులతో యథేచ్ఛగా సాగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్

Satyam NEWS

సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం: పసుపులేటి ప్రదీప్ కుమార్

Bhavani

Leave a Comment