27.7 C
Hyderabad
April 30, 2024 09: 52 AM
Slider మహబూబ్ నగర్

కార్పొరేట్లకు ఊడిగం చేసేందుకే వ్యవసాయ బిల్లు

#CPIProtest

వ్యవసాయ బిల్లు కు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల కేంద్రంలోని ఎన్టీయార్ చౌరాస్తా దగ్గర ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు  మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ ల రూపంలో తెచ్చిన బిల్లులను రాజ్యసభ లో ఓటింగ్ కు పెట్టకుండా, సెలెక్ట్ కమిటీకి పంపాలనే డిమాండ్ ను కూడా తిరస్కరించి ఏకపక్షంగా వ్యవహరించారని అన్నారు.

ప్రతిపక్ష, వామపక్షాలు, ఎన్ డి ఏ భాగస్వామ్య పక్షాలు న్యాయపరమైన డిమాండ్ లు చేసినా పట్టించుకోకుండా నిర్బంధం గా మూజువాణి ఓటుతో చట్టాలను ఆమోదించుకోవడం ప్రజా స్వామ్యంను ఖూనీ చెయ్యడమే అని అన్నారు.

అగ్రిబిజినెస్ లోకి వస్తున్న రియాలన్స్, జియో, అమెజాన్ వంటి బహుళజాతి కార్పొరేట్ సంస్థలకు అవసరమైన వ్యాపార ఆహార పంటల ఉత్పత్తి కోసం ప్రోత్సాహించాలనుకొంటున్న కార్పొరేట్ సహకార వ్యవసాయం లో చిన్న కమతాలు గల భారత రైతాంగం భవిష్యత్ లో తమ పొలాల్లో తామే కూలీలుగా మారే ప్రమాదం ఉందని వారన్నారు.

అత్యంత ప్రమాదకరమైన ఈ చట్టాలను రద్దు చేయకుంటే రైతాంగ ప్రజాగ్రహానికి బీజేపీ గురికాకతప్పదని వారు హెచ్చరించారు.

ఈ కార్యక్రమానికి సిపిఎం,మండల కార్యదర్శి బి శివవర్మ,అద్యక్షత వహించారు. సిపిఎం జిల్లా నాయకులు, డి ఈశ్వర్,సిపిఐ టౌన్ కార్యదర్శి యూసుఫ్, రైతుసంఘం,జిల్లా ఉపాధ్యక్షుడు బాలపీర్,

ఆవాజ్ సంఘం నాయకులు, ముంతాజ్ అలీ,సలీం, గిరిజన సంఘంజిల్లా నాయకులు, దశరథం,భాస్కర్ నాయక్,కెవిపియస్,మండల కార్యదర్శి బత్తిని రాజు రజక వృత్తిదారుల సంఘం సంఘం జిల్లా కార్యదర్శి పెద్దాపురం భాస్కర్ కురుమూర్తి,

సిపిఐ నాయకులు సత్తి, నాగన్న, బాలస్వామి, గంగన్న, రాజు, లింగస్వామి, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Related posts

హత్రస్ అత్యాచారంపై నేటి సాయంత్రం మహబూబ్ నగర్ లో సత్యాగ్రహం

Satyam NEWS

విద్యార్థుల కాళ్లు కట్టేసి..హెడ్‌మాస్టర్ దాష్టీకం…

Satyam NEWS

కరోనా సోకితే జ‌ర్న‌లిస్టుల‌కు బెడ్లు సిద్దం చేసిన విజయనగరం కలెక్టర్

Satyam NEWS

Leave a Comment