33.2 C
Hyderabad
May 15, 2024 20: 43 PM
కవి ప్రపంచం

రాజనీతిజ్ఞుడు

#Dr.Karnati Lingaiah

పి.వి రాష్ట్ర విద్యా శాఖ మాత్యులు గా ఉండి

సంస్కృతాంధ్ర భాషలు అభివృద్ధి చేశాడు

ప్రాచ్య కళాశాలలకు అనుబంధం చేశాడు

ఇదియే కర్నాటి మాట మేటి బాట

పోతన పంచశతి ఉత్సవాలు నిర్వహించి

ఉత్సవాలను మధుర స్మృతిగా నిలిపారు

పీ.వీ. ఉపన్యాసం పరిశోధన కు మచ్చుతునక

ఇదియే కర్నాటి మాట మేటి బాట

భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచంలో పెద్దది

జీవన విధానమును గొప్పగా నమ్ముతుంది

ఇది ఇది ప్రజాస్వామ్య ఉన్నత లక్ష్యం అంటాడు

ఇదియే కర్నాటి మాట మేటి బాట

రాజా నీతి జ్ఞత విధేయతలను నమ్మి

ఇందిరాగాంధీ మెప్పును పొందినాడు

అంతరంగిక నమ్మకస్తులో ఒకరఅయ్యాడు

ఇదియే కర్నాటి మాట మేటి బాట

విదేశీ సంబంధాలను తన శైలికి మార్చుకుని

పారిశ్రామిక దేశాల పెట్టుబడులను ఆహ్వానించి

అమెరికాను మిత్ర దేశంగా మార్చుకున్నాడు

ఇదియే కర్నాటి మాట మేటి బాట

అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ తో సంభాషించి

అమెరికా సెనేటర్ లతో లాబీయింగ్ చేసి

భారత వ్యాపార స్తులను పరిచయం చేశాడు

ఇదియే కర్నాటి మాట మేటి బాట

-డా.కర్నాటి లింగయ్య, హైదరాబాద్, 9515298610

Related posts

నిన్ను తలంచి…

Satyam NEWS

అక్షర దుప్పటి

Satyam NEWS

వెలుగురేకై పల్లవించాలి

Satyam NEWS

Leave a Comment