26.2 C
Hyderabad
May 10, 2024 21: 59 PM
కవి ప్రపంచం

ఆయనొక మౌని

#Dr,Vusala Rajani Gangadhar

ఆయనొక మౌని

నవరసాలూ ముఖంలోనే

అన్ని రసాలకూ ఒకటే ముద్ర అదే మౌనం

మౌనంలోనే అనంతభావాలను పలికించగల దిట్ట

అభివృద్ధి రాతలు రాయగల స్రష్ట

బహుభాషా కవి పండితుడు

ఆంధ్రీకరించగలడు

అన్య భాషలకు అనువదించనూ గలడు

మౌనం ఆయన ఆంగికం

శాంతం ఆయన ఆహార్యం

చిరునవ్వే ఆయన ఆభరణం

ఆవేశం ఆయన శత్రువు

ఆలోచన ఆయన మిత్రుడు

సంస్కరణలకు ఆద్యుడు

సంస్కారాలకు ఆచార్యుడు

బలహీనమైన పార్టీకి ప్రాణదాత

నూతన ఆర్ధిక విధాన విధాత

అత్యున్నత స్థానాన్ని అధిరోహించినా

అహం లేని తెలుగుబిడ్డ పివీ

అందుకే ఆయనొక మౌని

డా.వూసల రజనీ గంగాధర్, సెల్ నెం 9290680605

Related posts

అల్పసంతోషి

Satyam NEWS

చివ‌ర‌కు మిగిలేది…

Satyam NEWS

బహుముఖ ప్రజ్ఞాశాలి

Satyam NEWS

Leave a Comment