29.7 C
Hyderabad
May 1, 2024 09: 26 AM
కవి ప్రపంచం

బహు భాషాకోవిదుడు

#LingalaRajani

తెలంగాణ మట్టి పరిమళ గుబాళింపులతో

ప్రపంచం గర్వించే నేతగా

తెలంగాణ ముద్దుబిడ్డగా

ఉగ్గుపాలతోనే ఉద్యమ

పౌరుషాన్ని పునికి  పుచ్చుకొని

నిజాం నిరంకుశ పాలనను

దిక్కరించిన ఉద్యమకారుడు

పల్లెలో పుట్టి జాతీయస్థాయికి

ఎదిగిన  నాయకశిఖరం 

చదివింది న్యాయవాద వృత్తి

కానీ జర్నలిస్టుతో ప్రారంభమై

గొప్ప రాజకీయవేత్తగా ఎదిగి

హంగు ఆర్భాటాలు లేకుండా

ఒదిగి ఉండేగుణంలో తనేసాటి

ఆర్థిక సంస్కరణల పితామహుడుగా

అనేక పదవులకు వన్నె తెచ్చిన

ప్రధానిగా మొదటి దాక్షిణాత్యుడు

రాజకీయ చతురతను కలిగి

స్థూలదృష్టి ఉన్న రాజనీతిజ్ఞుడు

సాహితీవేత్తగా, అనువాదకుడిగా

బహు భాషాకోవిదుడుగా వన్నెతెచ్చుకున్న  తెలుగు బిడ్డగా

చరిత్రలో నిలిచిన గొప్పఘనుడు

-లింగాల రజిని, కరీంనగర్, 9494996856

Related posts

సంక్రాంతి సంబరాలు

Satyam NEWS

సహస్రఫణి

Satyam NEWS

పి.వి

Satyam NEWS

Leave a Comment