26.7 C
Hyderabad
May 3, 2024 08: 03 AM
Slider కవి ప్రపంచం

అక్షర దుప్పటి

#koppula prasad

అక్షర దుప్పటి కప్పుకుని

కమ్మటి నిద్ర లోకి జారుకున్నాను

కలలెన్నో కన్నాను

ఉదయాన్నే కాగితం మీద పంచుకున్నాను

రెక్కలు విప్పిన సీతాకోక చిలుకలు

మారు పలికే రామచిలుకలు

లేత ఆకులు మరిగిన కోయిలలు

అక్షర రూపంలో కాగితము పై వాలిపోయే…

ఆశల తీగలకు కాసిన ఫలాలు

మొక్కలకు విరబూసిన పువ్వులు

ప్రకృతిలో వికసించిన రూపాలు

నా కలంలో మకరందం నింపి జాలువారే..

గగనాన వెలిసిన గ్రహాల సముదాయం

చీకట్లో మెరిసే నక్షత్రాల మండలం

వేలాడే సూర్యచంద్రులు వెలుగులు

నా ఊహల సామ్రాజ్యం అంతా  కాగితంపై దిగెను..

జడల వెంట పరుగులు తీసిన

అవి కాస్తా నదుల్లో దూకెను

నదుల వెంట అడుగులు వేస్తూ

ఆ కన్నీళ్లను అంతా కాగితంపై నింపినా…

ఎడారి అంతా తిరిగినా

మంచినీళ్లలా సంపద కొరకు

పచ్చటి స్థలం కనిపిస్తే చూడాలని

కలానికి బలం తెచ్చి రాయాలని ‌‌…

ఊహలన్నీ ఆకాశములో మెరుపులు

చేతికి అందవు చింత తీర్చవు

రాత్రి కల ప్రోద్దున్నే మాయం

కాగితం మీద రాసిన సంతకం మాత్రం మిగిలింది..

కొప్పుల ప్రసాద్, నంద్యాల, 9885066235

Related posts

అనారోగ్యంతో పాకిస్తాన్ అణు శాస్త్రవేత్త ఖదీర్ ఖాన్ మృతి

Sub Editor

దేశంలోనే అగ్రశ్రేణి రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ

Satyam NEWS

సీఎం కేసీఆర్ రక్షా బంధన్ శుభాకాంక్షలు

Satyam NEWS

Leave a Comment