29.7 C
Hyderabad
May 4, 2024 04: 46 AM
కవి ప్రపంచం

మన పి.వి

#PusalaSatyanarayana

వరంగల్ జిల్లా  లక్నేపల్లి గ్రామములో ఉదయించిన భానుడెవ్వరు ? 

రుక్నాబాయి సీతారామారావు దంపతుల పుత్ర రత్న మై మెరిసింది ఎవ్వరు ?

కరీంనగర్ జిల్లా వంగర గ్రామానికి తరలి వచ్చింది ఎవ్వరు ?

పాములపర్తి రంగారావు రుక్మణమ్మలకు దత్త పుత్రుడు అయి అవతరించిన అపర చాణక్యుడు ఎవ్వరు ?

పాములపర్తి  వెంకట నరసింహారావు గా రాజకీయ కురుక్షేత్రం లో శంఖారావం పూరించింది ఎవరు ?

పదిహేడు భాషలను ఔపోషణ పట్టి తెలుగు వెలు గును దిగంతరాలకు  విరజిమ్మిన బహు భాషావేత్త ఎవ్వరు ?

ఇంకెవ్వరూ మన   ఠీవి యే ! 

వందేమాతరం ధిక్కార స్వరం వినిపించి

నిరంకుశ నిజాం పాలనను నిలదీసి

పిన్నవయసు లోనే ఉద్యమాల భాట పట్టిన స్వాతంత్ర్య సమరయోధుడు  మన పివి యే !

భూసంస్కరణల కు జీవం పోసి కొత్త ఒరవడి సృష్టించి మార్గదర్శకుడివి అయ్యావే !

వెయ్యి పడగలు హిందీ లోకి అనువదించి 

వేయి పడగల రాజకీయ రంగములో  ఆరి తేరి 

అనూహ్య మైన రీతిలో  ప్రధాని పగ్గాలు చేపట్టి  సరిలేరు నీకెవ్వరు ? అనిపించు కున్న ప్రజ్ఞా శాలి ఇంకెవ్వరూ  మన తెలుగు వాడే !

చిక్కి శల్య మై చితి పైకి చేరిన ఆర్థిక వ్యవస్థను సమర్థ తో దీటు గా ఎదుర్కొని  గాడిన పెట్టిన ధీశాలి.

సాహిత్య వనములో అడుగుపెట్టి కలానికి పదును పెట్టి  గొల్ల రామవ్వ తో  తెలంగాణ సాయుధ పోరా టం కనులముందు  చూపించిన నావే !

సాహిత్య ప్రక్రియ లెన్నో చేపట్టి  తెలుగు అకాడమికి ప్రాణం పోసింది నీవే కదా!

ఇన్ సై డర్ తో అంతర్ముఖం  చూయించిన ఘనత నీదే కదా !

చేపట్టిన పదవుల కెన్నో వన్నె తెచ్చి తెలుగు వెలుగు కీర్తి కీరిట ములో అమరజ్యోతి గా నిలిచి పోయింది ఎవ్వరు ?

ఇంకెవ్వరూ మన పివి  తెలుగు వెలుగు ప్రసారమయ్యే టీ వీ

పూసాల సత్యనారాయణ,  హైదరాబాద్,  సెల్ నంబర్ 9000792400

Related posts

చకోర రవం

Satyam NEWS

ఆత్మీయ అమ్మ

Satyam NEWS

ఆచార్యదేవ

Satyam NEWS

2 comments

Poosala satyanarayana September 22, 2020 at 6:47 PM

బాగుంది

Reply
Poosala satyanarayana September 22, 2020 at 6:51 PM

చక్కగా రూపొందించారు సాహిత్యం కు మీరు చేసే కృషి అంకితభావం కొనియాడదగినది. తెలంగాణ లో ఆణిముత్యాలు కొదువ ఏమీలేదు.తెలుగు వాడి కీర్తి ప్రపంచానికి తెలియ చేసే వారెందరెందరో. సమాచారం తెలియ చేసే విధానం చాలా బాగుంది
ధన్యవాదాలు

Reply

Leave a Comment