37.2 C
Hyderabad
May 2, 2024 11: 54 AM
Slider కవి ప్రపంచం

చకోర రవం

#Sandhya Sutrave New

బీడైన భువి మోడైన మాను
చినుకు సవ్వడికై తండ్లాట
ఋతుపవనాల రాక
మేఘసందేశంతో చినుకు లయ షురూ
చకోరపక్షుల రావాలు తొలకరికి ఆనవాలు
తొలి చినుకులే వాటి దాహార్తిని తీర్చు
జంతు పశుపక్ష్యాదులకు
ధరలో ఆహ్లాదం
బీడూ మోడుల పులకింత
తడిచిన నేల చెమ్మ నిలుపుకొని
మొలక చిగురింత
ప్రకృతి పలు వర్ణాలతో
రాగరంజిత మగు
జనావాసాలు తొలకరి
సవ్వడిలో సేదతీరు
తడిచిన మట్టి పరిమళం వెదజల్లు
తరువులు పుష్ప పత్ర
సౌరభాలతో మురియు
పండ్లు కాయగూరలకు
అనువైన సేద్య కాలం
ఎప్పుడెప్పుడా ! అని
ఎదురు చూచే రైతు
ఆశలు నెరవేరు కాలం
పండుగ పబ్బాలతో సంతోషకరం
ప్రకృతిమాత కు పూజలందించ
పడుచు పిల్లలు వనితలు
పట్టు పావడాలు చీరలతో
అందం ఆనందం ఇనుమడించు కాలం
ఉరుములు మెరుపుల ఘీంకారాలకు
బెదరక మేఘాలు విడుచు
నీటి పూలబాణాలకు ఎదురొడ్డి
నిలిచి తడిచి ముద్దయి
ఆడుకోవాలని చిన్నారుల
ఆకాంక్ష తీరు కాలం
అంతా శాంతంగా సవ్యంగా
జరిగినంత వరకు అన్నీ
శుభ సూచికములే !

సంధ్య సుత్రావె, ఫోన్ 9177615967, హైదరాబాద్.

Related posts

కాళేశ్వరంపై మతిలేని మాటలు వద్దు

Satyam NEWS

పాజిటీవ్: ఇంకా కనికాను వదలని కరోనా వైరస్

Satyam NEWS

వచ్చే ఏడాది జనవరి 1 నుంచి సమగ్ర భూ సర్వే

Satyam NEWS

Leave a Comment