29.7 C
Hyderabad
May 4, 2024 04: 13 AM
కవి ప్రపంచం

పాములపర్తి మన ఘనకీర్తి

#C.Sekhar

నరసింహుడి పేరుగాంచి

ఉగ్రరూపం దాల్చని నవ్వులరేడాయన

జ్ఞానధనుడు సుజనుడు

విజ్ఞాన బాండాగారం

ఆయనడుగేసిన చోటెల్లొ

అపజయమెరుగని అజేయుడాయన

ఓర్పు నేర్పుల కలయిక

మునివంటి మౌనం ఆయన నైజం

నిజామునెదిరించిన ధీరత్వము

వందేమాతరాన్ని గుండెధైర్యం నింపుకొని ఆలపించి

పోరాటమేదైనా ముందుకు సాగడం పి.వి సొంతం

ఆయనడుగెట్టని రంగంలేదు

పండితపుత్రుడు

బహుభాషలను ఆలవోకగా

తన మదిలో నిలిపిన ప్రతిభశాలి

అన్నిబాషల్లో పాండిత్యం సాధించిన పిపాసకుడు

సరస్వతి కటాక్షంతో సారస్వతంలో తనదైన శైలిని ప్రదర్శించిన బహుముఖప్రజ్ఞాశాలి

ఎన్నోరచనలు చేసిన

మాతృభాషను ప్రేమించాడు

ఆయన ఎదిగిన క్రమమైతే

‘ఇందుగలదందులేడు’

అనే విధంగా పేరుపొందిన

ఆయన కీర్తి హిమాలయమంతైనిలిచింది

న్యాయవాదవృత్తిలో ఆయనకాయనే సాటి

రాజయకీయచదరంగంలో

అపరచాణుక్యుడాయన

ఎత్తులకు పైఎత్తులేసి

ప్రతిపక్షాలను పద్మవ్యూహంలోకి నెట్టేస్తారు

ఢిల్లీ పీఠాన్ని అధిరోహించిన

తెలుగు వాడు ఘనుడు

ఆయనకు చదువులో మేటి

మాటతీరులో హాస్యచతురత

రాజకీయరంగంలో ఓటమెరుగని నాయకత్వం

చివరివరకు ఆయనసొంతం

తెలుగువాడికీర్తిని విశ్వవ్యాప్తం చేసిన పీ.వి

వన్నెతరగదు మా ఎదలో

ఎప్పటికీ నీ  ఠీ.వి

సి. శేఖర్(సియస్సార్), పాలమూరు, 9010480557

Related posts

మాతృ దేవత..

Satyam NEWS

అల్పసంతోషి

Satyam NEWS

వందన సమర్పణ

Satyam NEWS

Leave a Comment