28.7 C
Hyderabad
April 28, 2024 06: 07 AM
కవి ప్రపంచం

అల్పసంతోషి

#PattemVasantha

ఉదయం మేల్కొన్నది మొదలు

అష్ట శతావధానాలు చేస్తూనే

క్షణం తీరిక లేకుండా అందరికీ

అన్నింటినీ సమకూర్చే ఆ గృహలక్ష్మి

అంట్లు బట్టలతో కుస్తీ పడుతూ

ఇల్లు వాకిళ్ళు శుభ్రంగా కడిగేస్తూ

ఇంటి ముంగిట రంగ వల్లులతో

అందంగా తీర్చిదిద్దే ఆ ఇంటి మహాలక్ష్మి

సంసార రథానికి తనో చక్రమై

పిల్లల ఆలనాపాలనా చదువులు

అత్తమామల బంధుత్వాల నడుమ

పుట్టినింటికి మెట్టినింటికి తానే వారధి

భూదేవిల భారమంతా మోస్తూ

తాను తిన్న తినకపోయినా

ఇంటాబయటా అన్నీ తానై

అలుపెరుగక శ్రమించే శ్రమజీవి

ప్రేమానురాగాలకు చిరునామాగా

ఇంటిల్లిపాదికి ఆత్మీయురాలై

చిన్న మెప్పులకే సంబర పడిపోయే

అనురాగవల్లి అయినా అల్పసంతోషి

పత్తెం వసంత, కరీంనగర్

Related posts

బతుకు యుద్ధంలో…

Satyam NEWS

మన రైతు

Satyam NEWS

భాగ్యదాయిని

Satyam NEWS

Leave a Comment