37.7 C
Hyderabad
May 4, 2024 11: 49 AM
Slider కవి ప్రపంచం

గాంధర్వగానం

#DevalapallySunanda

సరిగమల గమకాలే  నీగమనమై

స్వరాభిషేకాలు చేసిన స్వరమాంత్రికుడవై

నీపాటకు మంత్రముగ్ధులైన గాంధర్వులు

మా గాన గాంధర్వుడిని

గగనానికి ఆహ్వానించినారు

మమ్మల్ని శోకసంద్రంలో ముంచేసి

అమరేంద్రుడి ఇంట పాడుతాఠీయగా అంటూ

స్వర్గానికి ఏగినావా ఓబాలు

నీపాట అజరామరమై భువిని ఏలుతుంది

నీపేరు చిరస్మరణీయమై నిలిచి ఉంటుంది

మా గుండెల్లో నీపాట దీపమై వెలుగుతూ ఉంటుంది

సంగీత సుస్వరాల తోటలో

వనమాలి నీ గొంతు మూగబోయింది

స్వరాల పుష్పరాజం కరోనాతో పోరాడి అలసిసొలసి

వాడి రాలిపోయింది

కరోనా రక్కసి వదిలేసినా

కర్కశమైన విధి మన బాలుని

మనకు దూరం చేసింది

గగనానికి ఏగిన గాయకా

నీకిదే మాఅందరి అశ్రునివాళి

దేవలపల్లి సునంద

Related posts

ప్రిపరేషన్: ఇబ్బందులు రాకుండా ఎన్నికల నిర్వహణ

Satyam NEWS

అడ్డాకుల ఎస్సైపై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

Satyam NEWS

ఉత్తరాయణ పండుగను ఘనంగా జరుపుకున్న అమిత్ షా

Satyam NEWS

Leave a Comment