33.2 C
Hyderabad
May 4, 2024 01: 59 AM
కవి ప్రపంచం

మన పి.వి.

#Akella Venkata Subbalaxmi

పి.వి.అంటే దేశానికే కాదు ప్రధాని

అన్ని రంగాలలో ప్రధానమే

పాలన లోనే కాదు, సాహిత్యములోనూ మేటి

విజ్ఞతలో, లౌక్యములో లేరు సరిసాటి.

సంస్కారములోనే కాదు సంస్కరణల లోను  మిన్నే.

సాహితీ రంగములో ఎన్నో అవార్డులు పొందిన ఘనాపాటి 

అనేక భాషలు నేర్చినా

మాతృ భాష పై మక్కువ వీడని వాడు.

మౌన ముని, మితభాషి  అయినా

సమస్య లొస్తే చూపించాడు చాణుక్యనీతి

పరిష్కరించారు ఎన్నో సమస్యలు

దక్షినాదికి  మణీ హారం

తెలంగాణాకు  సుమహారం

సుఖ ,దుఖాలకు అతీతుడు

పదవి, సంపదలెన్నున్నా గర్వించనివాడు

అవి పొయినా దుఖించని వాడు 

రాష్ట్రానికి  ముఖ్యమంత్రిగా, దేశానికి ప్రధాన మంత్రిగా గెలిచాడు.

దక్షీణాది నుంచి దేశానికి ప్రధానిగా ఎదిగిన ఏకైక నాయకుడు.

సంఖ్యాబలం  ఎక్కువ లేకున్నా ఒంటరిగా పోరు సలిపి, గెలిచిన  నాయకుడు.

భార్యపై ప్రేమతో కళాశాల కట్టించినాడు

డబ్బూ, పదవీ, అవకాశా లెన్నున్నా ఏకపత్నీ వ్రతుడుగా నిలిచాడు.

రాజ్యభారమెంతున్నా, ఒంటరిగా పొరాడవలసి వచ్చినా

ధైర్యము వీడనివాడూ, దేశాభ్యున్నతికై పొరాడిన వాడు

అందుకే అయ్యాడు అందరకి చిరస్మరనీయుడు, వందనీయుడు.

ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి 9849464017

Related posts

తల్లి హృదయం

Satyam NEWS

కీర్తి కిరీటి

Satyam NEWS

త్రివర్ణ కేతనం

Satyam NEWS

Leave a Comment