42.2 C
Hyderabad
April 30, 2024 18: 05 PM
కవి ప్రపంచం

తల్లి హృదయం

#PattemVasantha

అమ్మ అనే పిలుపులో

ప్రేమనురాగాలు ఎన్నో

నవమాసాలు మోసి

పేగు తెంచి జన్మనిచ్చి

మరుజన్మ నెత్తే కన్నతల్లీ

నీ రక్తందారలే క్షీరదారాలుగా

కడుపునిండా పాలుఇచ్చే తల్లి

జోల పాటలతో నిద్రపుచ్చి

ఎడమ, కుడి చేయి అనక

రాత్రిపగలైనా విసుగువిరామమెరుగక

మలమూత్రాలు కడిగిన అమ్మ

ఉడుకు బువ్వ బిడ్డలకు పెట్టి

మాడుచెక్కలు ,సద్దన్నం నీవుతిని

కడుపు కట్టుకొని పిల్లలను సాకి

బుద్ధులెన్నో చెప్పి బుజ్జగిస్తూ

నీ ఒడిలో ఒదిగి ముద్దుముచ్చట్లతో

స్వర్గాన్ని తలపించే దేవతవు నీవు

పొట్టగడవక పొలం పని కెళ్లగా

చిమిడి ముక్కు,చింపిరి జుట్టుతో

ఒళ్లంతా దుమ్ము ధూళితో నిండి

వికారంగా కనిపించినా మురిపెంగా

గుండెలకు హత్తుకొని ముద్దాడేతల్లి

నీ మాతృహృదయం వెలకట్టలేనిది

గడియ కనపడకపోతే ఆగమాగమై

తల్లడిల్లి పోయే తల్లిమనసు నీది

ఎంత చెప్పిన మాటలకందని నీ ప్రేమ

అమ్మ ప్రేమకన్నా అవనిలో సాటిలేదు

పిల్లలు ఉన్నత శిఖరాలు చేరడానికి

అనునిత్యం పరితపించే తల్లులైన

మాతృమూర్తులందరికీ ప్రణామాలు

( మాతృదినోత్సవం సందర్భంగా)

పత్తెం వసంత, కరీంనగర్

Related posts

తిరిగిరాని వలస!

Satyam NEWS

జెర సోచాయించు తమ్మీ….

Satyam NEWS

ఓ ప్రేమికులారా! కాస్త ఓపిక పట్టండి!

Satyam NEWS

Leave a Comment