కవి ప్రపంచం

కీర్తి కిరీటి

#Govindavarjhula Laxmi Narayana Shastry

పాండిత్య విదురుడు,

సౌమ్యుడు,సౌశీలుడు,సుమధురుడు

తెలుగుతేజముతో ప్రపంచములో వెలుగునింపి,

భరతకీర్తి పతాకముఎగురవేసిన,

బహుభాషా కోవిదుడు మన నరసింహుడు.

తీవ్రవాద సర్పముల కోరలు తీసి,

దేశమును రక్షిoచిన ధీశాలి,

అణుసామర్ధ్యమునకు ఆదియతడు,

సాంకేతిక  విప్లవము నాందిపలికి,

వ్యాపార సరళీకరణము చేసి,

యువశక్తికి పదును పెట్టి,

ప్రగతిరధమును పరుగులు పెట్టించి,

దేశకీర్తిని ప్రపంచానికి  చాటిచెప్పిన లోకనాయకుడు,

భూసంస్కరణలు తెచ్చి,భూస్వాముల పీచమణచి,

బడుగువర్గాలకు బహుబాగుచేసి,

తెలుగుజాతిని ఏకంచేసి జ్ఞానదీప్తిని వెలిగించి,

జాతిగౌరవము పెంచిన అపర చాణక్యుడు

ఘన కీర్తి  కిరీటి మన  పి.వి.

-గోవిందవర్జుల లక్ష్మి నారాయణ శాస్త్రి, అనకాపల్లి, చరవాణి: 9492988836

Related posts

పంద్రాగస్టు

Satyam NEWS

శ్రీ ప్లవ వత్సర కాంక్ష

Satyam NEWS

తొలి జల్లు పలకరింపు

Satyam NEWS

Leave a Comment