37.2 C
Hyderabad
May 2, 2024 12: 51 PM
కవి ప్రపంచం

మన తెలంగాణ బిడ్డ

#Ganji Kalavathi Nalgonda

తెలుగుకు వెలుగు తెచ్చిన తెలంగాణ బిడ్డ

తెలుగు వారి ఘనతను చాటిన సాహిత్యవేత్త

విద్యార్ధి దశలోనే ఒంటరిగా అడుగేసి

పోరుకు దిగిన ధైర్యశాలి

వందేమాతరమును ఆలపించి నైజామును

ఎదిరించి వణికించిన దేశభక్తుడు

ఉద్యమాలలో చేరి హైదరాబాదు

విముక్తి కై పోరాడిన సాహసికుడు

మౌనంతోనే సమాధానాలను పలికించి

పరిష్కారాలను చూపిన ధీరుడు

పరిపాలనలో నేర్పును చూపి

అపర చాణక్యుని మరిపించిన మేధావి

సామరస్యముతో పనులు చక్కదిద్దిన ధీశాలి

నిస్వార్థ సేవతో తనకై ఆలోచించక

భరతమాతను మురిపించిన సహనశీలి

పలు భాషలు నేర్చి ప్రాంతీయ భేదాన్ని

మాపిన మనసున్న ప్రఙ్ఞావంతుడు

రాజనీతితో మెళకువలు చూపి

రాజ్యమును నడిపిన నైపుణ్యవంతుడు

అనువాదములు చేసి అన్ని భాషల

వారినీ ఆదరించిన ఆత్మీయుడు

వేయిపడగలు కావ్యమును హిందీలోకి మార్చి

అత్యంత గౌరవప్రదమైన కేంధ్ర సాహిత్య

పురస్కారము దక్కించుకున్న విఙ్ఞాన వేత్త   

ఇన్ సైడర్లో తన లోపలి మనిషిని చూపిన నీతిపరుడు

కీర్తికై ప్రాకులాడక సమర్ధవంతమైన పాలన చేసి

ప్రజల మనసు గెలిచిన పరిపాలనాదక్షుడు

సాహితీవేత్తగా చివరి వరకు సేవ చేసి

భరతమాతను మెప్పించి

తెలగు గడ్డకు కీర్తి తెచ్చిన త్యాగశీలి

పాములపర్తి వేంకట నరసింహారావుగా వెలిగి

పి.వి.నరసింహారావుగా వర్ధిల్లిన విఙ్ఞానఘని.

గంజి కళావతి శ్రీనివాస్, నల్లగొండ

Related posts

సంక్రాంతి సోయగాలు

Satyam NEWS

నువ్వొస్తావనీ…!

Satyam NEWS

ప్రియసఖుడు

Satyam NEWS

Leave a Comment