29.7 C
Hyderabad
May 14, 2024 01: 28 AM
కవి ప్రపంచం

జనప్రియ నేత

#Gudipally Narasimhareddy

అందరి తలలది ఒకేపరిమాణం

కొందరి తలలది

ఎంతో అమోఘం

తల చిన్నదే పలు భాషలకు

నెలవైంది

భావాలను పెంచింది ప్రజలనాలుకయ్యింది

కోట్ల ప్రజల భారతదేశంలో

తన నైజం జూపించింది

ప్రజా అవసరాల తనమనసున

అవగతం చేసుకుంది

హంగులు ఆర్భాటాలు

తనకేమాత్రం నచ్చవంది

తన ఆలోచన ప్రజాహితం

దేశ ఉపయోగం కోరుకుంది

అభివృద్దిన మనదేశం ముందునుంచ దలచింది

ప్రపంచాన దేశ కీర్తి చాటి

జెప్ప దలచింది

మచ్చలేని పాలననైదేళ్ళపాటు

నడిపింది

తెలుగుభాష దేశానికి మొదటి

మెట్టు అయ్యింది

గొప్ప నేత యయ్యి తెలంగాణ

ప్రధాన మెట్టు నెక్కింది

ఓరుగల్లు ఓర్పుగల్లు కాకతీయ

చరిత యిల్లు

తను పాపను గని దేశానికి

గొప్ప నేతనిచ్చింది

ఆర్భాటం యిష్ట పడనినేత

చివరంతిమ  సమయాన

అందరిలా ఆర్భాటం లేని  తుది వీడ్కోలు తనకు కోరుకుంది

ఎవరయ్యా ఎవరు వారు

ఇంత చెప్పుకొచ్చారు

చెప్పుటకేమున్నది ప్రియనేత

మననేత పి వి నర్సింహారావు

-గుడిపల్లి నర్సింహారెడ్డి, జిల్లా నాగర్ కర్నూల్, ఫోన్ నెం 9441590623

Related posts

అలుపెరుగని బాటసారి

Satyam NEWS

కాలాతీతుడు

Satyam NEWS

కెరటం నేర్పే పాఠం

Satyam NEWS

Leave a Comment