38.2 C
Hyderabad
May 3, 2024 21: 23 PM
కవి ప్రపంచం

చెలియా….

#K.Harinath

ఇవాళ నా చుట్టూ

చిరునవ్వుల కలకలలు

నా చెలియనుంచి

పూలవర్షమై కురిసినట్లు…….

ఆ అందాల భరిణ చిలిపి చూపులు

తూపులై హృదిని గుచ్చుకున్నట్లు

తన కనురెప్పల సవ్వడికి

ఈ కవి హృదయం ఉప్పొంగి

కావ్యఖండికల అక్షర మాలలను

అల్లినట్లు….

ప్రేమామృత ధారలు కురిపించినట్లు…

నా రక్తంతో తన చలనం

నా ఊపిరితో తన శబ్దం

నా అక్షర మాలల్ని పెనవేసుకుని

మదిమనసు గదినిండా పరచుకొని

మౌనముద్రల్ని వేసుకుని

మౌనంగా నిరీక్షిస్తున్నట్లు….

నువ్వెప్పుడూ నా గమ్యానివే

నేనెప్పుడూ నీవాడినే

నా జీవితాంతం

నువ్వు నా అర్ధాంగివే

అన్న సంతోషంతో…..

కె. హరనాథ్,  9703542598

Related posts

చాక్ పీస్

Satyam NEWS

కార్తీక శోభ

Satyam NEWS

పివి ఒక ఆదర్శం

Satyam NEWS

Leave a Comment