38.2 C
Hyderabad
May 3, 2024 21: 16 PM
కవి ప్రపంచం

వందనం

#Vedaardham Madhusudhana Sharma

గర్భములో ఎన్ని అలజడులున్నా,

అగ్నిపర్వతాలు బద్దలైనా,

లోపల పిండం ఎన్ని తిప్పలు పెట్టినా,

ఓర్పుతో నవమాసాలు మోసి,

మనల్ని ఈ భూమి మీదికి తెచ్చిన

జన్మప్రదాత అమ్మ.

సంసార సాగరాన్ని ఈదే క్రమంలో,

ఎన్ని ఆటంకాలు ఎదురైనా,

ధైర్యముతో ముందుకెళుతుంది అమ్మ.

కష్టాలన్నీ మూకుమ్మడిగా దాడి చేసినా,

మొక్కవోని ఆత్మవిశ్వాసముతో,

గట్టెక్కించే ధీశాలి అమ్మ.

క్షణం తీరిక లేకుండా,

అలసట చెందకుండా.

సెలవు తీసుకోకుండా,

నిరంతరం

సంసారాన్ని నెట్టుకొచ్చే

కార్యశీలి అమ్మ.

కుటుంబ సభ్యులకు

ఆపద వస్తే,

తనకే వచ్చినట్లు తల్లడిల్లి,

రాత్రీ పగలు సపర్యలు

చేసే సహనశీలి అమ్మ.

ఎలాంటి ఆపద, కష్టం

రానీయకుండా,

కుటుంబ సభ్యులకు

తోడూ నీడై,

సరిహద్దుల్లో సైనికుడిలాగా,

రక్షణగా ఉండేది అమ్మ.

సంతోషాలకు గర్వపడక,

దుఃఖాలకు బాధపడక,

సుఖాలకు పొంగిపోక,

కష్టాలకు కుంగిపోని

స్థితప్రజ్ఞురాలు అమ్మ.

అందుకే మాతృమూర్తి

సహనానికి,ఓర్పుకు

వందనం,పాదాభివందనం.

వేదార్థం మధుసూదన శర్మ, 9063887585

Related posts

ప్రియ నేస్తం

Satyam NEWS

బోనం సాక !

Satyam NEWS

ప్రియ ప్రకృతి

Satyam NEWS

Leave a Comment