37.2 C
Hyderabad
May 6, 2024 15: 01 PM
Slider కవి ప్రపంచం

అమ్మ

#Ravuri Vanaja

కోడి కూత కంటే ముందే లేచి,

కూసంత సేపు కూడా అలసట తీసుకోకుండా, అలుపెరుగక అన్ని పనులు చేస్తూ,

తను పస్తులున్నా తన బిడ్డల

కడుపు నింపుతుంది…అమ్మ.

తను తన కన్నీళ్ళను కమనీయంగా తాగి,

కష్టాలను ఇష్టాలుగా మార్చుకుంటుంది …..అమ్మ.

మంచి పనులను నేర్పిస్తుంది.

మమకారాన్ని పంచుతుంది.

అవమానాలను భరిస్తూ,

అవసరాలను తీరుస్తుంది…అమ్మ.

నిర్మలత్వానికి ప్రతీకగా నిలిచి,

నిండు మనసుతో ఆశీర్వదిస్తుంది.

ఆత్మ విశ్వాసాన్ని నింపుతూ,

ఆత్మ బంధువులా సాక్షాత్కరిస్తూ,

ఆప్త మిత్రునిలా ఆదు కుంటుంది….అమ్మ.

బ్రతుకును సస్యశ్యామలం చేసే, “సిరిని” అందిస్తూ,

కమ్మని కరుణకు కార్తీక దీపం వంటిది…అమ్మ.

రావూరి వనజ, అధ్యక్షురాలు, తెలంగాణ మహిళా సాహితీ,సాంస్కృతిక సంస్థ, మహబూబ్ నగర్ 9491486275.

Related posts

శాసన మండలి రద్దు తొందరపాటు నిర్ణయం

Satyam NEWS

ఆర్ధికంగా పతనమైపోయిన ఉక్రెయిన్: మరి కొన్ని దేశాలు కూడా…

Satyam NEWS

హుజూర్ నగర్ లో బిజెపి శక్తి కేంద్రాల స్ట్రీట్ కార్నర్ కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment