39.2 C
Hyderabad
May 4, 2024 20: 36 PM
కవి ప్రపంచం

సంబరాల సంక్రాంతి

#aita anita

సరదాసరదా సంక్రాంతి పల్లెలపాలిట నవకాంతి

సంబరాలనే తెచ్చిన వేళ అంబరాన్నంటిన ఆనందహేళ

హరిదాసుల హరినామం

చిరుతలతో చిరు విన్యాసం

పల్లెకు ముగ్గుల మణిహారం

గంగిరెద్దుల కోలాహలం

పచ్చనిపైరుల సోయగాలు

పసిడిపంటల ధాన్యరాశులు

భోగిమంటలతో నవభోగాలు

పాలపొంగులతో కలిగెను శుభాలు

బొమ్మల కొలువుల సంరంభం

పతంగి ఆటల సందోహం

పొలాలలో పొలిచల్లి

పంచభూతాలకు ప్రణమిల్లి

అన్నదాతలకు ఆశల హరివిల్లై

పుడమి తల్లికి కొత్తపులకింతై

వచ్చింది వచ్చింది సంక్రాంతి తెచ్చింది పల్లెకు నవకాంతి

అయిత అనిత, 8985348424, జగిత్యాల

Related posts

పుణ్యభూమి

Satyam NEWS

అలుపెరుగని అల

Satyam NEWS

యాంత్రిక నిష్క్రమణ

Satyam NEWS

Leave a Comment