33.7 C
Hyderabad
April 29, 2024 00: 06 AM
Slider కవి ప్రపంచం

అలుపెరుగని అల

#shyamalanew

ఆడది ఆదిశక్తి అంటారు

కానీ ఆదిలోనే తుంచేస్తుంటారు

మా ఇంటి మహాలక్ష్మి అంటారు

కానీ మైనస్ గానే లెక్కిస్తారు

స్త్రీలను గౌరవించే సంస్కృతి అంటారు

కానీ సదా కించపరుస్తూనే ఉంటారు

సుద్దులన్నీ అమ్మాయికి

హద్దులే ఉండవు అబ్బాయికి

మాటల్లోనే స్త్రీ, పురుష సమానత్వం

చేతల్లో ఇంటా బయటా అసమానత్వం

పార్లమెంటులో ముప్ఫై మూడు శాతం

ఇప్పటికీ సాకారం కాని స్వప్నం

పదవులొచ్చినా అవి నామమాత్రమే

పెత్తనం పురుషుల సొంతమే

పేరుకే మనది ప్రజస్వామ్యం

వాస్తవంలో అది పురుషస్వామ్యం

మహిళా దినోత్సవం ఏటా వస్తుంది

కానీ మార్పే రావడంలేదు ఏనాటికీ

ఏమున్నది గర్వకారణం?

ఈరోజునా అత్యాచారాలు..హత్యాచారాలు

షరా మామూలే

వేదికలపై పొగడ్తలకు పొంగిపోతాం

అల్పసంతోషులం కదా

అయినా అడుగు ముందుకేయాలంటే

ఆశే కదా మనిషికి అసలైన శ్వాస

ఆత్మబలమే కదా కొండంత అండ

గుప్పెడు విజయ గాథల స్ఫూర్తిని

గుండెనిండా నింపుకుని

సాధికారత సాధనకు

అనవరతం ప్రయత్నించే నువ్వు

అలుపెరుగని అలవు!

జె.శ్యామల

Related posts

చివరి షెడ్యూల్ లో స్కై

Satyam NEWS

పోలీస్ స్టేషన్ లోనే రిలే నిరాహార దీక్షలు

Satyam NEWS

కరోనా ఎదుర్కొనడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

Satyam NEWS

7 comments

Pushpa March 19, 2022 at 1:11 PM

ఎన్ని మార్పులు వచ్చినా మహిళల కష్టాలు మాత్రం ఎన్నటికీ పోయేట్లు లేవు మేడం.

Reply
విరించి March 19, 2022 at 1:12 PM

ఆడవారిని అడగద్రొక్కు తూ వివక్షగురిచేస్తున్న సమాజాన్ని ఎదిరిస్తో అలుపెరుగని పోరాటం చేస్తున్న మహిళలకు స్ఫూర్తి నిస్తో శ్యామల గారు రాసిన కవిత చాలా బాగుంది..శ్యామల గారికి అభినందనలు.

Reply
Gannavarapu Narasimha Murty March 19, 2022 at 2:19 PM

స్తీల మీద వ్రాసిన కవిత చాలా బాగుంది.
రచయిత్రికి అభినందనలు

Reply
Mramalakshmi March 19, 2022 at 2:55 PM

Kavitha spoortidayakamga vundi.madam gariki dhanyavadamulu. ???

Reply
ఇలపావులూరి వెంకటేశ్వర్లు March 19, 2022 at 3:10 PM

ఎంతో అభివృద్ధి సాధించామని చెప్పుకోవడమే కాని నానాటికి స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలు ఏమాత్రం తగ్గడం లేదు. అదే విషయాన్ని చిన్న చిన్న పదాలతో చక్కగా తెలియ చెప్పిన కవయిత్రి శ్రీమతి శ్యామల గారికి ధన్యవాదాలు

Reply
J GuruPrasad March 19, 2022 at 8:04 PM

Excellent narration by Syamala garu regarding terrible injustice done to women

Reply
Satyam NEWS March 19, 2022 at 11:16 PM

Thank you

Reply

Leave a Comment