36.2 C
Hyderabad
April 27, 2024 21: 40 PM
Slider కవి ప్రపంచం

పుణ్యభూమి

#medisettiyougeswararao

సర్వస్వ మర్పించి

కష్టాల పాలయిన..

సత్యమును వీడనీ

హరిశ్ఛంద్రుని కన్న

భూమి ఇదియే..

దేవుడే  రాముడిగ

ధర్మమే మార్గముగ..

నడయాడినా యట్టి

నేల ఇదియే..

విష్ణువే …కృష్ణుడై

జగతికే మార్గముగా..

గీత భోధించినా

ధాత్రి ఇదియే..

యుగములే మారినా

తరములే మారినా..

సత్యంబు వీడనీ

దేశమిదియే…

తుర్ష్కురులు

ముష్కరులు

పలుమార్లు దండెత్తి దోచుకున్నా గాని…

వర్తకము పేరిట

తెల్లోడు కొన్నేళ్లు

తిష్టేసి

పాలించినా గానీ

తన ఉనికి కోల్పోని

భూమి ఇదియే…

కర్మ భూమి ఇదియే…

కొన్ని వందల ఏళ్లు

పరపిడనలో ఉన్న..

ధర్మమును కోల్పోక

సత్యమును పలుకుతూ…

స్వభావమీడనీ

ప్రజలున్నదేశంబు..

భరతఖండ బిదియే

పుణ్యభూమి ఇదియే..

ధర్మ సంస్థాపనార్దాయా

భగవంతుడే స్వయం..

పదిసార్లు దిగివచ్చి

పలకరించిన

యట్టి భరతఖండం బిదియె

వాల్మీకి విరచితము రామకధ ఈనేల ..

బాదరాయణ యుక్తి

భారతము ఈ భూమి..

వేద రాశుల గుట్ట

ఉపనిషత్తుల పుట్ట..

ఙ్ఙ్నాన మొసగూ నట్టి

గీత పుట్టిన  మట్టి

పరమాత్ముడేకాదు

ప్రకృతి దైవంబె

రాయి రప్పాకూడా దైవస్వరూపంబె

ఈ ధరణి యందు..

ధర్మంబు ఓ కంట

సత్యమింకొక కంట

పరులసొమ్మూ కొరకు

పాకులాడని ధాత్రి…

పరమ పావన మైన

నదులున్న దేశంబు

ఇన్నిమాటలు ఎలా..

ఒక్క మాటే చాలు

వసుధయే సాక్ష్యంబు..

సారే జహసే అచ్చా..

హిందూసితాః హామరా..

హామార..

మేడిశెట్టి యోగేశ్వరరావు, మచిలీపట్నం, సెల్: 9490168715

Related posts

జూనియర్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్ కు మంత్రి అభినందన

Bhavani

ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎంజాయ్ చేసే సినిమా ‘సోలో బ్రతుకే సో బెట‌ర్‌’

Satyam NEWS

ఇళ్ల పట్టాల కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు జరపాలి

Sub Editor

Leave a Comment