34.7 C
Hyderabad
May 5, 2024 00: 20 AM
Slider కవి ప్రపంచం

వలస కూలీ వరస…

#Kandakatla Janardhan

లాభం నష్టం… కష్టం ఇష్టం తేడా తెలియక

అర్థ రూపాయి కోసమైనా… క్యూలో కూలీగా

నీవు అవతరిస్తే..?!

తన అంతరంగ ఆలనా పాలనలో

యథార్థంగా.. ఆశించని కూలీ ఎవరికి వారే..!

ఆకలి రుచి ఈలలూ…

అలసట లేని అలలూ…

మండుటెండల నిత్యవసంతాలూ…

ఎప్పుడూ సుముహూర్తాలూ

ఇప్పుడు ఎక్కడో దాక్కున్నాయెందుకనీ..?

పేదరికమే పెద్దరికమిపుడు

మరి కూలీ దొరకలేదని కూలిపోవడమెందుకనీ..?

గొంగళి పురుగు జీవపరిణామంలో

సీతాకోకచిలుకల్లాగా

మనకి సర్దుబాట్ల సహవాసం చిరపరిచితమే కదా..!

నీదారి ఎడారైనా ఒయాసిస్సు ఒకటుంటుందనీ

దారం తెగిన గాలిపటానివై

నీవెక్కడ చిక్కినా చితికినా…తారాజువ్వలా మొలకెత్తి

work is worship    స్వేదవేద నినాదంగా వర్షిస్తున్న క్రమంలో

అకాల మృత్యువుని కూడా గాఢనిద్రగా తలచి

గమ్యం చేరడం గగనమైనా

నీ ప్రతి అడుగూ…శ్రమైక అరుణ కిరణమే..!

మిత్రమా…

ఎవరెస్ట్ శిఖరం.. ఎవరెక్కారనేది సంచలన వార్త కాదిపుడు…

ఎవరెవరు క్షేమంగా.. తమ గూటికి చేరారనే సాహసాల లెక్కలిపుడు..!

మొన్నటి దాకా ప్రభువెక్కిన పల్లకీ మోసిన నీవు

ఈ క్షణాన

ఉపాధి లేమితో రోడ్డెక్కి… ఉప్పెనలా పడిలేచే కెరటమై

ఎప్పటికైనా తీరం చేరుకొని… తీరని దాహం తీర్చుకొని..

తటాకంలా తట్టుకొని నిశ్చయంగా నిర్భయంగా

ఎదురీదే.. జిందగీ రంగులు వెలిసి పోనివ్వక

కదిలి.. కలిసి కురిసే మేఘమాలలా

వలస కూలీవై .. మళ్ళీ వస్తావని…

కందకట్ల జనార్ధన్, Librarian, Govt junior college, Huzurabad. చరవాణి:789 3631 456.

Related posts

సాగు చట్టాల రద్దుపై కేంద్రానికి తికాయత్‌ అల్టిమేటం

Sub Editor

పోలీసులకు మంచి నీళ్లు కూడా ఇచ్చేది లేదు

Satyam NEWS

డిసెంబ‌రు 27న ఆన్‌లైన్‌లో స్లాటెడ్ స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు విడుద‌ల

Satyam NEWS

Leave a Comment