38.2 C
Hyderabad
April 29, 2024 14: 13 PM
Slider జాతీయం

సాగు చట్టాల రద్దుపై కేంద్రానికి తికాయత్‌ అల్టిమేటం

వివాదాస్పద కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ తికాయత్‌ తేల్చిచెప్పారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి నవంబర్‌ 26 దాకా గడువు ఇస్తున్నామని చెప్పారు. అప్పటిలోగా మూడు చట్టాలకు మంగళం పాడకపోతే ఢిల్లీలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మోదీ ప్రభుత్వం ఒకవేళ ఆ చట్టాలను ఈరోజే రద్దు చేస్తే పోరాటాన్ని ఇప్పుడే ఆపేస్తామని చెప్పారు.  నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలోని సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌ బోర్డర్‌ పాయింట్ల వద్ద సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో రైతులు కొనసాగిస్తున్న ఉద్యమానికి నవంబర్‌ 26న సంవత్సరం పూర్తికానుంది.

Related posts

ముంపు ప్రాంతాలలో ఇప్పటి నుంచే పూడికలు తీయండి

Satyam NEWS

అపర తిరుపతి మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయం లో ప్రత్యేక పూజలు

Bhavani

త్వరలో గ్రూప్-4 నోటిఫికేషన్

Murali Krishna

Leave a Comment