37.2 C
Hyderabad
April 30, 2024 12: 54 PM
Slider గుంటూరు

‘పిడికెడు ఆత్మగౌరవం కోసం’ ఉద్యమ గోడ పత్రిక ఆవిష్కరణ

#chandrababu

ఆంధ్రప్రదేశ్ బహుజన ఆత్మగౌరవ సమితి ఆధ్వర్యంలో రూపొందించిన ‘మాకు ఊపిరి ఆడటం లేదు’ అంటూ ‘పిడికెడు ఆత్మగౌరవం కోసం’ ఉద్యమ  గోడ పత్రికను మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, లోగోను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఆవిష్కరించారు. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆత్మగౌరవ సమితి రాష్ట్ర అధ్యక్షులు పోతుల బాలకోటయ్య సారధ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ దళిత, గిరిజన, మైనార్టీలపై దాడులు పెరిగాయని, ఆత్మగౌరవం ,ఆత్మ రక్షణకు రక్షణ లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ అణచివేతలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుందని చెప్పారు. రానున్న కాలంలో క్రింది కులాల సంక్షేమానికి, గౌరవానికి తెలుగుదేశం పార్టీ పెద్దపేట వేస్తుందని భరోసా ఇచ్చారు. 

సమితి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య మాట్లాడుతూ తెలుగు నేలపై కనీవిని, ఎరుగని రీతిలో  క్రింది కులాలపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, శిరోమండనాలు జరుగుతున్నాయని, పిడికిళ్ళు బిగించి, బహుజన కులాలు పిడికెడు ఆత్మగౌరవం కోసం కొత్త ఉద్యమానికి పురుడు పోస్తున్నట్లు  చెప్పారు.  డాక్టర్ సుధాకర్,   డాక్టర్ అచ్చెన్న, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అబ్దుల్ సలాం,  హజీరా, నంద్యాల మహాలక్ష్మి, పులివెందుల నాగమ్మ వంటి సంఘటనలు వెయ్యికి పైగా జరిగాయన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా దళిత కులాలు డబ్బుల చప్పుడు మోగించబోతున్నట్లు ప్రకటించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె . రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం దళితులను, గిరిజనులను పూర్తిగా మోసం చేసింది అన్నారు, రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని చెప్పారు. కూర్చున్న చెట్టుకు నరుకున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనా కొమ్మను తానే నడుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెం నాయుడు,  అమరావతి మహిళా జేఏసీ నాయకురాలు రాయపాటి శైలజ, మైనార్టీ హక్కుల పరిరక్షణ కమిటీ అధ్యక్షులు ఫరూక్ షుబ్లీ, నేషనల్ నవ క్రాంతి  పార్టీ అధ్యక్షులు కనకం శ్రీనివాసరావు, బీసీ మహిళా సంఘం చైర్మన్ యరగొర్ల నూకానమ్మ, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు సంపత్ కుమార్, ఎస్సీ సెల్ నాయకులు  మామిడి సత్యం, పాతర్ల రమేష్ తదితరులు  పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబును శాలువాలతో బహుజన నాయకులు సత్కరించి, ఆత్మగౌరవ మెమొంటోను బహూకరించారు.

Related posts

13న ఎంఎల్సీ ఎన్నిక పోలింగ్… జాగ్రత్తగా విధులు నిర్వర్తించండి…!

Satyam NEWS

మార్చి మూడో వారానికి విశాఖ నుంచి పాలన?

Bhavani

మద్యం సరఫరా చేసే కంపెనీలన్నీ జగన్ వే

Satyam NEWS

Leave a Comment