39.2 C
Hyderabad
May 3, 2024 11: 20 AM
Slider ప్రత్యేకం

సమాజ శాంతి కోసం అశువులు బాసిన పోలీసులు…

అక్టోబర్ 21 పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా “సత్యం న్యూస్. నెట్” ఘన నివాళి

మొక్క వోని దీక్ష… ధైర్యం, తెగింపు..ఇవన్ని కలవాడెవడంటే టక్కున ఎవ్వరైనా చెబుతారు… దేశ సైనికుడని.కానీ పోలీసు దుస్తులు వేసుకున్న సిబ్బంది లో కూడా… ఆ మూడు గుణాలు కలిగి ఉంటాయి. కానీ మ్యాన్యువల్ ఒకటి ఉంటుంది తదనుగుణంగా.. చట్ట ప్రకారం… పోలీసు ఉన్నతాధికారులు ఆదేశానుసారం నడుచుకుంటున్నారు..ప్రస్తుత పోలీసు. ఈ సోదంతా మాకెందుకు అని అంటారా..అక్కడికే వస్తోంది “సత్యం న్యూస్. నెట్”.అక్టోబర్ 21 దేశ చరిత్రలో గుర్తుండిపోయే రోజు.1959 అదే నెల అదే రోజు న హిమాలయ ప్రాంతం ఆక్సాయ్ చిన్ ప్రాంతంలో గస్తీ తిరుగుతున్న పదిమంది సీఆర్పీఎఫ్ జవాన్లను శత్రుదేశాలు పొట్టన పెట్టంకున్నాయి.అప్పటి నుంచీ అక్టోబర్ 21 అమర వీరుల సంస్మరణ దినోత్సవం గా పోలీసు జరుపుతూ వస్తోంది. ఇక జిల్లా కు సంబంధించి..2001లో సాలూరు కోర్టు.. సీఐ ముద్దాడ గాంధీ ని సాక్షాత్ జడ్జి ఎదురు గానీ మావోయిస్టులు కాల్పులు జరపడంతో అక్కడి క్కడే ప్రాణాలు విడిచారు. సీఐ తో పాటు కానిస్టేబుల్ కూడా చిరంజీవి పైన కాల్పులు జరిపిన ఘటనను జిల్లా పోలీసు శాఖ మరువలేనిది. అలాగే గాంధీ తో పాటు మరో నలుగురు వేర్వేరు ఘటననలో ప్రాణాలర్పించారు.ఈ సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటోంది…జిల్లా పోలీసు శాఖ. ఈ సందర్భంగా పోలీసు బాస్ ఎస్పీ దీపికా ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల దినోత్సవం జరగనుంది. ఈ మేరకు “సత్యం న్యూస్. నెట్”.. మృతి చెందిన పోలీసులకు నివాళులు అర్పిస్తోంది.

ఎం. భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా

Related posts

ప్రొటెస్టు: లాఠీ చార్జీకి నిరసనగా ఏబీవీపీ ధర్నా

Satyam NEWS

(Natural) | Hemp Bombs Cbd Capsules 2000mg Cbd Hemp Flower Scanner

Bhavani

ఇంటి మార్గం మూత వృద్దాప్యంలో మాజీ పోలీస్ ఇబ్బందులు

Sub Editor

Leave a Comment