27 C
Hyderabad
May 10, 2024 05: 22 AM
Slider ముఖ్యంశాలు

లోక్ అదాలత్ లోఎక్కువ ఐ.పి.సి. కేసులు డిస్పోజ్ కావాలి

#police

విజయనగరం జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ ఎం.దీపిక,  జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ లోక్ అదాలతో ఎక్కువగా ఐ.పి.సి. కేసులు డిస్పోజ్ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పోలీసు స్టేషన్ పరిధిలో గల అన్ని గ్రామాలను కానిస్టేబుళ్ళు దత్తత ఇచ్చి ఆయా గ్రామాల్లో తరుచూ సందర్శించి గ్రామాల్లో ఏ విధమైన తగాదాలు జరుగుతున్నాయో ముందస్తుగా సమాచారం సేకరించాలన్నారు.

శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పాత వివాదాలు శాశ్వతంగా పరిష్కారం అయ్యే విధంగా క్షేత్ర స్థాయిలో చర్యలు చేపట్టాలన్నారు. ప్రతీ వారం మహిళా సంరక్షణ కార్యదర్శులతో విధిగా సంబంధిత పోలీసు అధికారులు సమావేశాలు నిర్వహించాలని, ప్రజలను చైతన్యపర్చే విధంగా లోన్ యాప్ లు, సైబర్ నేరాలు, దిశ యాప్, పోక్సో చట్టం, మహిళల భద్రతకు రక్షణగా నిలిచే చట్టాలు పట్ల అవగాహన కల్పించాలన్నారు.

మహిళా సంరక్షణ పోలీసుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని, బైండోవరు కేసుల్లో సెక్యూరిటీ బాండులను తప్పనిసరిగా తీసుకోవాలని, సకాలంలో వారు వాయిదాలకు హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఎవరైనా వాయిదాలకు హాజరుకాకుంటే వారంట్లు జారీ అయ్యే విధంగా చూడాలన్నారు. రిఫర్ కేసుల్లో ఫిర్యాదుదారులకు నోటీసులు అమలు చేయాలని, కోర్టుల్లో ఫైనల్ రిపోర్టులను దాఖలు చేసి, ఆర్.సి. నంబర్లు తీసుకోవాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

కేసుల పెండింగ్ పై కారణాలు విశ్లేషించాలి

దర్యాప్తులో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులను జిల్లా ఎస్పీ సమీక్షించి, దర్యాప్తు పెండింగులో ఉండేందుకు కారణాలను దర్యాప్తు అధికారులను అడిగి తెలుసుకొన్నారు. కేసుల్లో దర్యాప్తును త్వరితతిన పూర్తి చేయాలని, అభియోగ పత్రాలను కోర్టుల్లో సకాలంలో దాఖలు చేయాలన్నారు. హిస్టరీ షీట్లు కలిగిన యువకులు, చురకైన వ్యక్తుల కదలికలపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు.

అసాంఘిక శక్తులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు, సంఘటనల పట్ల ముందస్తు సమాచారం సేకరించే విధంగా ఎం.ఎస్.పి.ల సేవలను వినియోగించుకోవాలన్నారు. గత మాసంలో నమోదై, దర్యాప్తులో ఉన్న కేసులను జిల్లా ఎస్పీ ఎం. దీపిక సమీక్షించి, త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసేందుకు అధికారులకు దిశా నిర్ధేశం చేసారు.

ప్రతిభ కనబర్చిన అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ అక్టోబరు మాసాంతరంకు గాను ప్రతిభ కనబర్చి వివిధ కేసులను చేధించుటలోను, విజయనగరం ఉత్సవాలు, శ్రీ పైడితల్లమ్మ పండగలో ట్రాఫిక్ విధులను సమర్ధవంతంగా నిర్వహణ, మద్యం అక్రమ రవాణ అరికట్టడంలోను, గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణ నియంత్రించిన

(1) నెల్లిమర్ల ఎస్ఐ పి.నారాయణరావు (2) విజయనగరం టూటౌన్ పిఎన్ ఎఎస్ఐ వై. పైడితల్లి (3) కానిస్టేబులు ఆర్.నారాయణరావు (4) ట్రాఫిక్ ఎస్ఐ ఎల్.దామోదర రావు (5) కానిస్టేబుళ్ళు వై. శంకర్రావు (6) వై.అప్పారావు (7) ఎల్.శ్రీను (8) ఎస్.సింహాచలం (9) చీపురుపల్లి ఎస్ఐ ఎ.సన్యాసినాయుడు (10) కానిస్టేబులు ఎం. భానోజీరావు

(11) ఆండ్ర హెచ్సి ఎం. మన్మదరావు (12) పెద మానాపురం కానిస్టేబులు ఎం.రమేష్ (13) గజపతినగరం స్పెషల్ బ్రాంచ్ హెచ్సి బి.శ్రీనివాసరావులను జిల్లా ఎస్పీ ఎం. దీపిక అభినందించి, ప్రశంసా పత్రాలను ప్రదానంచేసారు. ఈ నేర సమీక్షా సమావేశంలో బొబ్బిలి డిఎస్పీ బి. మోహనరావు, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు, ఎస్సీ మరియు ఎస్టీ సెల్ డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి, న్యాయ సలహాదారులు వై పరశురాం, డిపిఓ ఎఓ వెంకట రమణ, సిఐలు జే. మురళి, బి. వెంకటరావు, సిహెచ్. రుద్రశేఖర్, సిహెచ్. లక్ష్మణరావు, ఎస్. కాంతారావు, విజయనాధ్, జి.సంజీవరావు, ఎం.నాగేశ్వరరావు, ఎస్. తిరుమలరావు, కే. రవి కుమార్, సింహాద్రి నాయుడు, ఎల్. అప్పల నాయుడు, టి.వి.తిరుపతిరావు, డిపిఓ పర్యవేక్షకులు ప్రభాకరరావు, కామేశ్వరరావు మరియు వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ టైటిల్ సాంగ్ 23న విడుదల

Satyam NEWS

అసలు ఉత్తరాంధ్ర కు వైఎస్సార్సీపీ ఏం చేసింది?

Satyam NEWS

అన్ని రంగాల్లోనూ పాలక వర్గం ఘోర వైఫల్యం

Satyam NEWS

Leave a Comment