37.7 C
Hyderabad
May 4, 2024 12: 40 PM
Slider కవి ప్రపంచం

నువ్వొస్తావనీ…!

#Rayapureddy Satyanarayana

నువ్వొస్తావనీ..

నీతో ‘నవ్వుల పువ్వులు’ తెస్తావనీ..

‘చీకూ చింత’కు శెలవిస్తావనీ,

‘బాధల గాధలు’ మరపిస్తావనీ., మైమరపిస్తావనీ,

‘జగతి’ ఎదురు చూస్తోంది! ‘ప్రకృతి’ పలవరిస్తోంది!!

‘కొమ్మ’ పూలు పూస్తోంది! ‘కోయిలమ్మ’ కూస్తోంది!!

రావమ్మా!…రా!!

‘ప్లవ’ నామ ‘ఉగాది’వై!  విప్లవ నవ ‘యుగాది’వై!!

నువ్వొచ్చే దారిలో…

నింగినంటే ‘ధర’లుంటాయ్…నేలకు దించు!

‘అప్పు’ల నిప్పుల వాగునుండి…’అల్పజీవి’ని రక్షించు!

అలమటించే

హృదయాలలో …’ఆత్మస్థయిర్యాన్ని’ నింపు!

‘ఆత్మహత్య’ల దారి నుండి…’అన్నదాత’ను మళ్ళించు!!

రావమ్మా! రా!!

‘ప్లవ’ నామ ‘ఉగాది’వై!  విప్లవ నవ ‘యుగాది’వై!!

కులమతాల ‘కుళ్ళు’ నుండి…మా ‘థ్యాస’ను మళ్ళించు!

‘కరోనా’ మహమ్మారి బారి నుండి…నా జాతిని రక్షించు!

నెత్తురు వరదలై పారే ‘నరమేథా’నికి…’భరతవాక్యం’ పలికించు!

అబలల మాన ప్రాణాలతో ఆడుకునే…’మృగాళ్ళ’ను శిక్షించు!!

రావమ్మా! రా!!

‘ప్లవ’ నామ ‘ఉగాది’వై!  విప్లవ నవ ‘యుగాది’వై!!

‘స్వార్థాన్ని’ మా ఎదలోతుల్లో నుండి …శాశ్వతంగా తొలగనీ!

‘సమత, మమత’ల దీపాలను మా గుండె గదిలో పదిలంగా వెలగనీ!

‘మంచితనం’ నీడలో…మా బ్రతుకు ‘మొక్క’ను ఎదగనీ!

‘మానవతా’ కుసుమాలను మహిలో విరబూయనీ…!

రాయపురెడ్డి సత్యనారాయణ, హైదరాబాదు, చరవాణి: 9618672503.

Related posts

రుణాలు మంజూరు చేయాలి

Murali Krishna

కలిసి నడుద్దాం కాంగ్రెస్ ను గెలిపిద్దాం

Satyam NEWS

తపాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి

Satyam NEWS

Leave a Comment