అమరావతి పరిరక్షణ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం లభించింది. అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో జన సమీకరణ జరిగింది. గుంటూరు రోడ్డు నుండి పల్నాడు రోడ్డు వరకు జోలె పట్టుకుని ఆయన పాదయాత్ర చేశారు. ఆయనకు పెద్ద ఎత్తున విరాళాలు అందాయి.
ఈ కార్యక్రమంలో నరసరావుపేట నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, జీవి ఆంజనేయులు, రాయపాటి రంగారావు, మాజీ వికలాంగుల చైర్మన్ కోటేశ్వరరావు తదితర జిల్లా టిడిపి నేతలు పాల్గొన్నారు. ఇక చంద్రబాబు ర్యాలీకి న్యాయవాదులు, డాక్టర్స్, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, బీసీ సంఘాల నేతలు, భారీ సంఖ్యలో మద్దతు పలికారు.