25.2 C
Hyderabad
May 13, 2024 09: 16 AM
Slider మహబూబ్ నగర్

దళితులను విభజించి దెబ్బ తీసే ప్రయత్నం చేయవద్దు

#kollapur

నాగర్ కర్నూలు జిల్లా మాల లచైతన్య సమితి 2022 సంవత్సరం క్యాలెండర్ ను  అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం బాణాల గ్రామం అంబేద్కర్ విగ్రహం ముందు అచ్చంపేట అధ్యక్షులు పిల్లి రవికుమార్ ప్రధాన కార్యదర్శి మండల సుధాకర్ సంగం నాయకులు మహిళా నాయకులు ఆవిష్కరించారు.

అనంతరం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం లో దళిత బహుజనులకు విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో అభివృద్ధి చెందాలని రిజర్వేషన్లు కల్పించడం జరిగింది కానీ ప్రస్తుతం స్వార్థ రాజకీయ ఓటు బ్యాంకు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ ల మధ్య చిచ్చు పెట్టి ఐక్యతను దెబ్బతీస్తూ ఎస్సీ వర్గీకరణ చేయాలని ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారని అన్నారు.

భవిష్యత్తులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గాని ఈ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గాని రాష్ట్ర ప్రభుత్వం గానీ ఇంకా ఉన్న కొన్ని పార్టీలు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పదేపదే లేవనెత్త కుండా ప్రస్తుతం దళిత జనాభా దామాషా ప్రకారం 18.6 శాతానికి రిజర్వేషన్ పెంచుటకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు అన్నారు.

తమ స్వార్థ రాజకీయాల ఓటు బ్యాంకు కోసం పదే పదే ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెర పైకి తీసుకు వస్తే బహుజన వర్గ వివక్షత ఉన్న భవిష్యత్తులో రాజకీయ సమాధి చేస్తామని అందుకు మాలలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బా నల్ల గ్రామం ఉప సర్పంచ్ ఈ సుధాకర్ ఈతిరుపతయ్య ఈ  శ్యామ్ మహిళలు పి వెంకట్ అమ్మ భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రష్యా సబ్‌మెరైన్‌ ఇంజినీర్‌ విశాఖలో మృతి

Satyam NEWS

బోటు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన జగన్

Satyam NEWS

ట్రాజెడీ: సీనియర్ నటి వాణిశ్రీకి పుత్రశోకం

Satyam NEWS

Leave a Comment