40.2 C
Hyderabad
May 2, 2024 16: 17 PM
Slider విజయనగరం

ప్రజా సమస్యల పరిష్కారానికి విజయనగరం పోలీసుల టెలి-స్పందన

#vijayanagarampolice

ప్రతీ వారం మాదిరి గానే ఈ వారం కూడా జిల్లా పోలీసు బ్యారక్స్ లో స్పందన జరిగింది. అయితే సారి కరోనా ఉధృతి కారణంగా టెలిఫోన్ ద్వారా బాధితులు నుంచీ ఫిర్యాదు తీసుకుంది పోలీసు శాఖ. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల ఫిర్యాదులను పరిష్కరించేందుకు “టెలి-స్పందన” కార్యక్రమాన్ని నిర్వహించారు… అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణ రావు.

ఈ “టెలి-స్పందన” కార్యక్రమంలో భాగంగా అదనపు ఎస్పీ జిల్లా పోలీసు కార్యాలయంలో 08922-276163 ద్వారా 14 ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలో కరోనా ప్రభావం తగ్గేంత వరకు ప్రజలెవ్వరూ జిల్లా పోలీసు కార్యాలయానికి రాకుండానే ప్రతీ సోమవారం ఉదయం 10-30 గం||ల నుండి మద్యాహ్నం 1-00 గం||లమధ్య 08922-276163కు ఫోను చేసి తమ సమస్యలను తెలియజేవచ్చునన్నారు.

టెలి-స్పందనకు ఫోను ద్వారా వచ్చిన ఫిర్యాదులను అదనపు ఎస్పీ విని, పరిశీలించి పరిష్కారం నిమిత్తం, సంబంధిత అధికారులను ఆదేశించారు. “టెలి-స్పందన” కార్యక్రమంకు వచ్చిన కొన్ని ముఖ్యమైన ఫిర్యాదులు.

విశాఖపట్నం జిల్లా, భీమిలికి చెందిన ఒకామె అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన భర్త విజయనగరం డబుల్ కోలనీలో ఒక ఇంటిని కొన్నారని, తన భర్త, అత్తలు కొన్ని ఏళ్ల క్రితం చనిపోయారని, తన ఆడపడుచు ఫేక్ డాక్యుంమెంట్లు చూపించి తన ఇంటిని ఆక్రమించుకొన్నారని తనకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన అదనపు ఎస్పీ విచారణ జరిపి, చర్యలు తీసుకోవాల్సిందిగా విజయనగరం టూటౌన్ సీఐను ఆదేశించారు.

బొండపల్లి మండలం, మరువాడకు చెందిన ఒక వ్యక్తి అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ గుర్ల మండలం, కలవచర్లలో ఉన్న వ్యవసాయ భూమిని అమ్ముతానని, బొండపల్లి మండలం, తాళ్ళపూడి పేటకు చెందిన ఇద్దరు డబ్బులు తీసుకొని, అగ్రిమెంటు చేసి, రిజిస్ట్రేషను చేయకుండా కాలయాపన చేస్తున్నారని, తనకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన అదనపు ఎస్పీ విచారణ జరిపి, చర్యలు తీసుకోవాల్సిందిగా బొండపల్లి ఎస్.ఐను ఆదేశించారు.

భోగాపురం మండలం, గవరమ్మ పేటకు చెందిన ఇద్దరు వ్యక్తులు అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ వారి గ్రామానికి చెందిన వ్యక్తులు, ఫిర్యాదుదారుల పేర్లు గల ఇద్దరు వ్యక్తులు (తమ బంధువులు) వారికి సంబంధించిన భూములను రెండేళ్ల క్రితం వారికి తెలియకుండా అమ్మివేశారని, సదరు వ్యక్తులపై చర్యలు తీసుకొని, న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన అదనపు ఎస్పీ విచారణ జరిపి, చర్యలు తీసుకోవాల్సిందిగా భోగాపురం ఎస్.ఐను ఆదేశించారు.

భోగాపురం మండలం, మహరాజ పేటకు చెందిన ఒకామె అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన ఇంటికి అడ్డంగా కొంతమంది గోడ కట్టేశారని, తను ఇంటినుండి బయటకు రాలేని పరిస్థితి ఉందని, సదరు వ్యక్తులపై చర్యలు తీసుకొని, న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన అదనపు ఎస్పీ విచారణ జరిపి, చర్యలు తీసుకోవాల్సిందిగా భోగాపురం సీఐను ఆదేశించారు.

విజయనగరం కాళీఘాట్ కోలనీకి చెందిన ఒకామె అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ అదేవీధిలో ఉంటున్న ఇద్దరికి 4 లక్షలు రూపాయిలు చీటీలు కట్టానని, కాలం పూర్తయినా డబ్బులు ఇవ్వడం లేదని, తన డబ్బులు ఇప్పించి, తనకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన అదనపు ఎస్పీ విచారణ జరిపి, చర్యలు తీసుకోవాల్సిందిగా విజయనగరం వన్ టౌన్ సీఐని ఆదేశించారు.

గరివిడి మండలం, అత్తమూరుకు చెందిన ఒక వ్యక్తి అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన పొలంలో వేసిన మొక్కలను అదే గ్రామానికి చెందిన కొంతమంది పీకేసినట్లు వారిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన అదనపు ఎస్పీ విచారణ జరిపి, చర్యలు తీసుకోవాల్సిందిగా గరివిడి ఎస్.ఐ లీలావతిని ఆదేశించారు.

ఫిర్యాదులపై సంబంధిత పోలీసు అధికారులతో అదనపు ఎస్పీ స్వయంగా ఫోనులో మాట్లాడి, వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, వాటి పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఫిర్యాదుల పై తీసుకున్న చర్యలను వెంటనే తనకు నివేదించాలని అధికారులను అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణ రావు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్ బి సీఐ బి.వెంకటరావు, ఎస్ బి సీఐ జి. రాంబాబు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

మార్చిలో పదో తరగతి పరీక్షలు: మంత్రి సురేశ్‌

Satyam NEWS

ఉస్మానియా డాక్టర్స్ సేఫ్

Bhavani

కాంగ్రెస్ పార్టీ నుండి టీఆరెస్ లోకి భారీ చేరికలు

Satyam NEWS

Leave a Comment