ఆంధ్రప్రదేశ్ లోని దేవిపట్నం వద్ద గోదావరిలో లాంచీ ప్రమాద ఘటన జరిగిన ప్రదేశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెలికాప్టర్ నుంచి చూశారు. సోమవారం ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లారు. లాంచీ ప్రమాదం జరిగిన కచ్చులూరు ప్రాంతాన్ని రెస్క్యూ ఆపరేషన్ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం రాజమండ్రి ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. ముఖ్యమంత్రి వెంట హోం మంత్రి మేకతోటి సుచరిత కూడా ఉన్నారు.
previous post
next post