33.2 C
Hyderabad
May 4, 2024 01: 17 AM
Slider ముఖ్యంశాలు

ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధులు మధ్యలోనే డ్రాప్ అవుతారు

#shabbirali

బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీ అభ్యర్థులు ఎన్నికల లోపు మధ్యలోనే డ్రాప్ అవుతారని, ఆ భయంతోనే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తనకు టచ్ లో ఉన్నారని మాట్లాడుతున్నారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా బీబీపీట మండల కేంద్రంలో పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ తో కలిసి పాల్గొన్నారు.

అంతకుముందు జనగామ గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ ఫిరాయింపులపై ఇష్టం లేదన్నారు. కానీ కెసిఆర్ మాటిమాటికి మీ ప్రభుత్వాన్ని కూలగొడతామని రెచ్చ గొట్టే ప్రసంగాలు చేస్తూ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తున్నారని, అందుకే కాంగ్రెస్ పార్టీలో బిఆర్ఎస్ నాయకులను చేర్చుకోవడం జరుగుతుందన్నారు. 20 మంది ఎమ్మెల్యేలు కేసిఆర్కు టచ్ లో  ఉన్నారనడం అబద్దమని తెలిపారు.

ముగ్గురు బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఎలక్షన్ మద్యలో డ్రాప్ ఆవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, కెసిఆర్ భయపడి అబద్దపు మాటాలు మాట్లాడుతున్నారని తెలిపారు. ప్రభుత్వాన్ని పడగొడుతామంటే చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. బిఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్నారన్నారు. కేసీఆర్ కు జైలులోనే డబుల్ రూం కట్టామని, కుటుంబ సభ్యలందరిని ఒకే దగ్గర జైలులో ఉంచుతామన్నారు. పార్లమెంటు ఎన్నికల తరువాత బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో సురేష్ షెట్కార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎంపీ ఎన్నికల అనంతరం నియోజకవర్గ అభివృద్ధిపై పూర్తిస్థాయిలో దృష్టి పెడతానన్నారు.

బీజేపీని తరిమి కొడదాం: ఎంపి అభ్యర్థి సురేష్ షెట్కార్

శ్రీరాముని మొక్కుతూ బీజేపీని తరిమి కొడదామని జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ అన్నారు. బీజేపీ అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదని, రూ. 35 కే పెట్రోలు ఇస్తామని ఇవ్వలేదని, మహిళల రక్షణ ఇంకా భద్రత, కల్పిస్తామని కల్పించలేదన్నారు. నల్లధనాన్ని వెనక్కి రప్పించడంలో విఫలమైందన్నారు.

అదానీ అంబానీ లాంటి క్రోనీ క్యాపిటలిస్టులను బీజేపీ పెంచి పోషించిందన్నారు. న్యాయవ్యవస్థకు ఆటంకం కలిగించడం, ప్రజాస్వామ్యాన్ని నిరంకుశత్వం, నియంతృత్వంతో పాలించడం, రాజకీయాలను నేరస్థులు, రేపిస్టులు అవినీతి నేతలతో నింపడం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని పథకాలను అమలు చేస్తుందని, అందర్నీ సమానంగా చూస్తుందని, సుపరిపాలన అందిస్తుందని తెలిపారు.

రైతులను ఆదుకుంటాం: షబ్బీర్ అలీ

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని షబ్బీర్ అలీ తెలిపారు. మాచారెడ్డి మండలం సోమార్ పేట గ్రామంలో అకాల వర్షాల వల్ల కల్లాలలో ఆరబెట్టిన వరి ధాన్యం కొట్టుకపోవడంతో పాటు దెబ్బతిన్న పంట పొలాలను షబ్బీర్ అలీ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు నిరాశ నిస్పృహలకు లోను కావద్దన్నారు. పంట నష్టపోయిన ప్రతీ రైతును అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. నష్టం జరిగిన రైతులందరికీ పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

గత 15 రోజుల క్రితం రైతు సోదరుల ఆత్మైస్థెర్యం దెబ్బతినొద్దని ఆలోచించి సీఎం రేవంత్ రెడ్డి పంట నష్టంపై సర్వే చేయించి వారి వివరాలు సేకరించి నష్టపరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని, ఎన్నికల తర్వాత అందరికి నష్టపరిహారం అందిస్తామన్నారు. తడిసిన ధాన్యం కొనుగోలుపై కలెక్టర్ లు ఫోన్ చేసి మాట్లాడారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ ను కోరారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

ప్రొటెస్టు: ఎన్ ఆర్ సి, ఎన్ పి ఆర్ లను అమలుచేయనివ్వం

Satyam NEWS

చైతన్య అధినేత మృతి

Bhavani

కానుక తెలుగు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment