40.2 C
Hyderabad
May 5, 2024 16: 04 PM
Slider ముఖ్యంశాలు

తెలంగాణాకు నిధుల విడుదలలో చిన్న చూపు

#BRS Lok Sabha party

చమురు, ఆయిల్ ఫామ్ విత్తనాలు ఉత్పత్తికి సంబంధించి నిధులు విడుదలలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణా పట్ల తీవ్ర వివక్ష చూపిస్తోందని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు లోక్ సభలో లిఖితపూర్వకంగా కేంద్రాన్ని ప్రశ్నించారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి విడుదల చేసిన నిధుల వివరాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోందని అన్నారు. తెలంగాణా ప్రభుత్వం రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందన్నారు.కానీ కేంద్రం వివక్ష చూపిస్తూ నిధులు సక్రమంగా కేటాయించకుండా ఇబ్బంది పెడుతున్నారని నామ ధ్వజమెత్తారు.

దేశం స్వయం సమృద్ధి సాధించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇందుకోసం ఉద్దేశించిన వివిధ పథకాల స్థితిని వివరించడంతో పాటు దిగుమతి భారాన్ని తగ్గించడానికి తీసుకున్న చర్యలేమిటని పేర్కొన్నారు. పామాయిల్, ఇతర ఆయిల్ పంటల సాగు విస్తీర్ణాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను వెల్లడించాలని కోరారు. ఆయిల్ పామ్ , ఇతర తినదగిన నూనె పంటలు పధకాలకు గత ఐదు సంవత్సరాలలో కేటాయించిన , వినియోగించిన నిధుల వివరాలు వెల్లడించాలని కేంద్రాన్ని కోరారు.

భారతదేశం ఎడిబుల్ ఆయిల్, నూనె గింజలను ఎగుమతి చేసే దేశ స్థాయికి ఎప్పుడు ఎదుగుతుందని ప్రశ్నించారు. ఆయిల్ సీడ్స్, ఆయిల్ ఫామ్ ప్రాయోజిత పథకాల నిధుల కేటాయింపునకు సంబంధించి కేంద్రం తెలంగాణా పట్ల తీవ్ర వివక్ష కనబరుస్తుందని అన్నారు.2018 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి కేటాయించి, విడుదల చేసిన నిధుల్లో తీవ్ర వివక్ష చూపించారని పేర్కొన్నారు. 2022-23 లో ఆయిల్ సీడ్స్ కు సంబంధించి పైసా ఇవ్వలేదని నామ ఆక్షేపించారు.ఎన్ఎఫ్ఎస్ఎం , ఎన్ఎంఇఓ ఆయిల్ సీడ్స్, ఆయిల్ ఫామ్ పథకాలకు సంబంధించి తెలంగాణా లో 2018 – 19లో రూ 1000 ..00 లక్షలు కేటాయించి, కేవలం 250.oo లక్షలు మాత్రమే విడుదల చేశారన్నారు.

అలాగే 2019 -20లో రూ.1199.70 లక్షల కేటాయింపునకు గాను రూ.513.10 లక్షలు విడుదల చేశారు. 2020-21లో రూ 1310 లక్షలకు 180.59 లక్షలు విడుదల చేశారు.2021 -22 లో రూ.2342.20 లక్షలకు గాను కేవలం రూ.700.73 లక్షలు విడుదల చేయగా, 2022 – 23లో పైసా ఇవ్వలేదని చెప్పారు. ఆయిల్ ఫామ్ కు సంబంధించి 2022 – 23లో రూ.28,528 లక్షలకు గాను రూ.10743.50 లక్షలు విడుదల చేశారని చెప్పారు. గుజరాత్ కు ఆయిల్ సీడ్స్ కు సంబంధించి రూ.3251.50 లక్షలు కేటాయించడం జరిగిందన్నారు.

మిగతా రాష్ట్రాలకు భారీ కేటాయింపులు చేసి, నిధులు విడుదల చేసి, తెలంగాణా రాష్ట్రాన్ని విస్మరించారని నామ అన్నారు.కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేందర్ సింగ్ తోమర్ సమాధానం ఇస్తూ చమురు విత్తనాల ఉత్పత్తికి సంబంధించి కేంద్రం జాతీయ ప్రాయోజిత పధకం “ఎన్ఎఫ్ ఎస్ఎం – ఓఎస్ ” పథకాన్ని అమలు చేస్తుందని అన్నారు.

ఉత్పాదకతను పెంచి, దిగుమతి తగ్గించడం, తద్వారా స్వయం సమృద్ధిని సాధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు.

Related posts

హుజూర్ నగర్ నియోజకవర్గంలో మిన్నంటిన టిఆర్ఎస్ శ్రేణుల నిరసనలు

Satyam NEWS

మోడీ మోడల్: మన ప్రధానిని అనుకరిస్తున్న ప్రపంచ దేశాలు

Satyam NEWS

ప్రజా సమస్యల పరిష్కారం కై సిపిఐ మౌన దీక్షలు

Satyam NEWS

Leave a Comment