39.2 C
Hyderabad
April 28, 2024 13: 14 PM
Slider ముఖ్యంశాలు

వనమాకు కోర్టులో నిరాశ

#Kothagudem Vanama

తనపై అనర్హతను కొట్టివేయాలని, సుప్రీం కోర్ట్ కు వెళ్లెవరకూ తనకు స్టే ఇవ్వాలని కొత్తగూడెం వనమా వెంకటేశ్వరావు హైకోర్టు లో వేసిన పిటిషన్ ను కోర్ట్ కొట్టి వేసింది. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో వనమా కు నిరాశ ఎదురైంది .ఇప్పటికే జలగం వెంకట్రావు తనను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించాలని కోర్టు శాసనసభ స్పీకర్ ను అప్రోచ్ అయ్యారు . ఆయన అసెంబ్లీ లో సెక్రటరీ ని కలిసి హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీని అందజేశారు .

తర్వాత రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసి కోర్టు ఇచ్చిన జడ్జి మెంట్ కాపీని అందించారు . దీనిపై వారు పరిశీలిన జరిపి కబురు చేస్తామని అన్నారు. దీనిపై అధికారులు న్యాయసలహా కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం .అదే సందర్భంలో వనమా హైకోర్టు ను ఆశ్రయించడంతో కోర్ట్ నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయనే ఆసక్తి నెలకొన్నది .

వనమా పిటిషన్ స్వీకరించి విచారణ జరిపిన హైకోర్టు తీర్పును వెలువరిస్తూ వనమా పిటిషన్ కొట్టి వేస్తున్నట్లు తీర్పు వెలువరించింది . సుప్రీం కోర్ట్ కు వెళుతున్నందున అప్పటివరకు స్టే ఇవ్వలని వనమా కోరారు అందుకు కోర్ట్ నిరాకరించింది. దీంతో జలగం ప్రమాణస్వీకారానికి లైన్ క్లియర్ అయినట్లే .

అయితే ఎన్నిక కమిషన్ , అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారా అనేది ఆసక్తిగా మారింది. 2018 నుంచే జలగం వెంకట్రావు ను ఎమ్మెల్యేగా గుర్తించాలని హైకోర్టు స్పష్టం చేసింది.అంతే కాకుండా వనమా కు తప్పుడు సమాచారం ఇచ్చారని 5 లక్షల జరిమానా కూడా విధించింది.

Related posts

సచివాలయానికి గుత్తేదారు తాళం:చెట్ల కింద కూర్చున్న సిబ్బంది

Satyam NEWS

Corona Virus: ఐదు వ్యాక్సిన్ లలో ఒకదానికి అత్యవసర అనుమతి

Satyam NEWS

పార్టీ అధ్యక్షుడిలో…నడిపించే సత్తా కనిపిస్తోంది..!

Satyam NEWS

Leave a Comment