27.7 C
Hyderabad
April 30, 2024 07: 12 AM
Slider ముఖ్యంశాలు

మోడీ మోడల్: మన ప్రధానిని అనుకరిస్తున్న ప్రపంచ దేశాలు

sattibabu

దేశవ్యాప్తంగా ప్రబలి ఉన్న కరోనా వైరస్ ను తరిమి కొట్టే ప్రయత్నం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తమ వంతు సాయం అందించేందుకు ఎందరో ముందుకు వస్తున్నారు.

ప్రధాని నరేంద్రమోడీ దేశాన్ని కాపాడేందుకు తీసుకుంటున్న కఠినమైన చర్యలు ఎంతో ఉపయోగంగా ఉన్నాయిని, ఈ క్లిష్ట సమయంలో తన వంతు సాయం అందించాలని భావించినట్లు ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ ఎస్ బి పెరల్ ప్రాజక్ట్స్, గోకులనందన కార్పొరేషన్ అధిపతి ముత్యాల సత్తిబాబు తెలిపారు.

తొలి విడతగా రూ.50 వేలను ఆయన ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సహాయ నిధికి నేడు జమ చేశారు. ఈ క్లిష్టసమయంలో గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద పేదవారిని ఆదుకుంటున్న ప్రధాని మోడీ ని విధానాలను చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్య పోతున్నాయని సత్తిబాబు అన్నారు.

130 కోట్ల మంది ప్రజలను ఏకతాటిపై నడిపిస్తున్న ప్రధాని మోడీ విధానాలను చూసి ప్రపంచ దేశాలు కూడా పాటించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. ఇప్పటి వరకూ దేవాలయ నిర్మాణం, గ్రామ సేవలో ఉన్న తాను తొలి సారిగా ప్రధాని సహయ నిధికి విరాళం పంపుతున్నట్లు ఆయన తెలిపారు.

Related posts

టీబీ నిర్మూలనలో తెలంగాణ రాష్ట్రానికి మూడు పతకాలు

Satyam NEWS

బి‌ఆర్‌ఎస్ తో పొత్తు లేదు

Murali Krishna

ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

Satyam NEWS

Leave a Comment