41.2 C
Hyderabad
May 4, 2024 16: 37 PM
Slider ముఖ్యంశాలు

త్వ‌ర‌లో ల‌క్షమందితో స‌భ నిర్వ‌హిద్దాం… బ్రాహ్మ‌ణులంటే ఏమిటో చూపిద్దాం

#kona raghupati

త్వ‌ర‌లో  ల‌క్ష‌మందితో రాష్ట్రంలో బ్రాహ్మ‌ణులంతా బహిరంగంగా ఓ స‌భ నిర్వ‌హించాల‌ని ఏపీ రాష్ట్ర డిప్యూటీ స్పీక‌ర్ కోన ర‌ఘుప‌తి  అన్న‌రు. విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్రంలో ఆనందగ‌జ‌ప‌తి ఆడిటోరియంలో జ‌రిగిన రాష్ట్ర బ్రాహ్మ‌ణ సేవాసంఘం స‌మాఖ్య నిర్వ‌హించిన అభినంద‌న స‌భ‌లో డిప్యూటీ స్పీక‌ర్ మాట్లాడారు. ప్ర‌స్తుత అసెంబ్లీలో నాతో పాటు మల్లాది విష్ణు..ఇలా ఒక‌రిద్ద‌రూ మించి బ్రాహ్మ‌ణులు లేర‌ని…ఆ సంఖ్య పెంచుకోవ‌డానికి మ‌న బ‌లమేంటో యావత్ ప్ర‌జానీకానికి తెలియాల‌న్నారు.

అన్య‌మ‌త‌స్థుడు,క్రిష్టియ‌న్ అయినా  విజ‌యమ్మ‌, కొడుకు జ‌గ‌న్ ను ప‌ర‌మ‌తం గొప్ప‌దంటూ బ్రాహ్మ‌ణుల‌కు ఈబీసీలో 10  శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించిన ఘ‌నత వైఎస్ఆర్పీదేన‌న్నారు. సంఘ‌టితం అవుదాం…స‌మైక్య‌మ‌వుదాం… సాధించుకుందాం అంటూ ఏన్నోళ్లుగా బ్రాహ్మ‌ణులంతా చేసిన‌ పోరాట ఫ‌లిత‌మే రాష్ట్ర ప్ర‌భుత్వం…ఎక‌న‌మిక‌ల్లీ వీక‌ర్స్ సెక్ష‌న్ (ఈబీసీ) లో  బ్రాహ్మ‌ణుల‌కు ప‌దిశాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించింద‌న్నారు.

ప్ర‌స్తుతం బీసీల సంఖ్య ఎక్కువున్న ద‌ర‌మిలా త్వ‌ర‌లో రాష్ట్రానికి బీసీకిచెందిన సీఎం ముఖ్య‌మంత్రి అవుతార‌ని నా వ్య‌క్తిగ‌త అభిప్రాయ‌మ‌ని డిప్యూటీ స్పీక‌ర్ కోన ర‌ఘుప‌తి అన్నారు.అంత‌కుముందు స్థానిక ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్రస్వామి మాట్లాడుతూ…బ్రాహ్మ‌ణులంటే ఆర్య‌వైశ్యుల‌కు ఎంతో గౌర‌వ‌మ‌ని…వాళ్ల‌కు మ‌ర్యాద ఇచ్చి ఓ దేవుడిలా కొలుస్తామ‌న్నారు. ఉప‌నిషిత్తు,వేద వేదాంగాలు,  రాసిన రుషుల‌తో బ్రాహ్మ‌ణులు స‌మాన‌మ‌న్నారు.

న‌న్ను బ్రాహ్మ‌ణ ప‌క్ష‌పాతి అన్నా..వారు క‌నుస‌న్న‌ల్లోనే ఆర్య‌వైశ్యులంతా న‌డుస్తున్నామ‌ని ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల అన్నారు. ఇక వైఎస్ఆర్సీపీ ఉత్త‌రాంద్ర క‌న్వీనర్,  విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే కూతురు,29  డివిజ‌న్ కార్పొరేట‌ర్ కోల‌గ‌ట్ల శ్రావ‌ణి మాట్లాడుతూ..బ్రాహ్మ‌ణుడుంటే….బ్ర‌హ్మ విద్య తెల‌సిన వాడు అటువంటి బ్రాహ్మ‌ణుల‌ను అండ‌గా ఉన్న వ్య‌క్తి త‌న ఎమ్మెల్యే స్వామి అన్న అని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో  బ్రాహ్మ‌ణ నంఘం  రాష్ట్ర అధ్య‌క్షుడు స‌త్య‌వాడ  దుర్గా ప్రసాద్ తో పాటు జిల్లా అద్య‌క్షుడు కేపీ ఈశ్వ‌ర్, నిర్వ‌హ‌ణ క‌ర్త శ్రీనివాస్ ,ఇనిగంటి రాకేష్ శ‌ర్మ‌, త్రిశూల్ ర‌మ‌ణా స్కూల్స్ అధినేత కుమార్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మ‌ణులు పాల్గొన్నారు.

Related posts

3న జరిగే ములుగు టీఆర్ఎస్ సమావేశానికి తరలిరండి

Satyam NEWS

కొత్త రికార్డు దాటిన మెట్రో రైల్ కలెక్షన్లు

Satyam NEWS

స్కూలు పిల్లలకు గంజాయి పై చంద్రబాబు ఆందోళన

Satyam NEWS

Leave a Comment