28.7 C
Hyderabad
May 6, 2024 09: 05 AM
Slider రంగారెడ్డి

సిబిఐటి  లో ఘనంగా శృతి – 2023 ప్రారంభం

#cbit

చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (సిబిఐటి ) లో శృతి 2023 నేడు ఘనం గా ప్రారంభమైనది.  కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి రవీందర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం థీమ్ అఫ్ శృతి మీరాకి అని పెట్టినట్లు చెప్పారు. మీరాకి అంటే ఆత్మతో, సృజనాత్మకతతో, కృషితో ఎంతో ప్రేమతో చేసినది అని అర్ధం అన్నారు.

ఈ సందర్భంగా శృతి 2023 చైర్మన్ ప్రొఫెసర్ పివిఆర్ రవీందర్ రెడ్డి ఆధ్వరంలో 40 వ కళాశాల వార్షిక దినోత్సవం 3 రోజుల పాటు జరుగుతుంది. 3వ తేదీ నాడు సాయంత్రం 5 గంటలు నుండి క్రీడా దినోత్సవం వేడుకలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతర్జాతీయ కరాటే క్రీడాకారిణి అక్షర్ అభ్యుదయ్, గౌరవ అతిథిగా భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కుమారి కె మనీషా హాజరుకానున్నారు. శనివారం సాయంత్రం 5.30 గంటలు నుండి ఇన్స్టిట్యూట్ డే నిర్వహిస్తారు.  ఈ కార్యక్రమానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి, టిఎస్పిఎస్ సి చైర్మన్ డాక్టర్ బి జనార్దన్ రెడ్డి ముఖ్య అతిధి గా, ప్రసిద్ధ టాలీవుడ్ సినిమా డైరెక్టర్, రచయిత వై వి ఎస్ చౌదరి గౌరవ అతిథిగా వస్తున్నారు.

శృతి కో చైర్మన్  ప్రొఫెసర్ డి కృష్ణ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు శృతి ఐడల్, షార్ట్ ఫిలిం పోటీలు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. శృతి కన్వీనర్ ప్రొఫెసర్ బి శ్రీనివాస్ రెడ్డి, ప్రొఫెసర్ జి లక్ష్మయ్య,  డాక్టర్ ఆర్ రాజేశ్వరి దేవి,   విద్యార్థి వ్యవహారాల అధ్యక్షుడు ధీరజ్, చైతన్య క్రీడ – విద్యార్థి అధ్యక్షుడు బి పార్ధ సారధి, చైతన్య సంసృతి  కో ఆర్డినేటర్ కుమారి అనూష , ఇతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భం గా కళాశాల కాలేజ్ మ్యాగజైన్  ట్రాన్స్‌సెండెంట్ విడుదల చేసారు. వివిధ విద్యార్థుల కో -కర్రీక్యూలర్ మరియు ఎక్స్ట్రా కర్రిక్యూలర్ క్లబ్స్  పెరేడ్  ను నిర్వహించారు.

Related posts

సెన్సార్ పూర్తి చేసుకున్న “వి లవ్ బ్యాడ్ బాయ్స్”

Satyam NEWS

మెడలు వంచుతానన్న జగన్ ఇప్పడు మెడ ఎత్తడం లేదు

Bhavani

29,30 తేదీలలో తుంగతుర్తి మండల స్థాయి ఆటల పోటీలు

Bhavani

Leave a Comment