దైవదర్శనానికి వెళ్లిన ఓ కుటుంబం ఘోర రోడ్డు ప్రమాదేనికి గురైంది.తనవి తీరా దైవాన్ని మొక్కిసంతోషం తో తిరిగివస్తున్న ఆ కుటుంబ సభ్యులు అసువులు బాసారు.గుజరాత్ లో కారు అదుపు తప్పి, బొల్తా కొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిని వారిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్ కు తరలించారు.కాగా, వీరంతా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఒకే కుంటుంబానికి చెందిన వీరు సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకొని తిరిగి వస్తుండగా సురేంద్రనగర్ జిల్లాలోని దేవ్ పరా వద్ద జరిగిన ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.