26.7 C
Hyderabad
May 3, 2024 10: 38 AM
Slider రంగారెడ్డి

ఎసిఎమ్ విద్యార్థుల చాప్టర్ ప్రారంభం

#cbit

ఈ రోజు సిబిఐటి కళాశాల లో ఎఐఎమ్ఎల్ విభాగం ఆధ్వర్యం అసోసియేషన్ అఫ్ కంప్యూటర్ మిషనరీ (ఎసిఎమ్) విద్యార్థుల చాప్టర్ ను ప్రారంభించారు.  కళాశాల అసెంబ్లీ హాలు లో జరిగిన నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి   ముఖ్య అతిథి మరియు ముఖ్య వక్త అయిన హైదరాబాద్ డెక్కన్ ఎసిఎమ్ చైర్ పర్సన్ డాక్టర్ సి ఎస్ ప్రభు  ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన తర్వాత,  ఎసిఎమ్ 1947లో స్థాపించబడింది మరియు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద శాస్త్రీయ మరియు విద్యా కంప్యూటింగ్ సొసైటీ. ఇది లాభాపేక్ష లేని ప్రొఫెషనల్ మెంబర్‌షిప్ గ్రూప్,  అని తెలిపారు.   కంప్యూటర్ సైన్స్ లో వివిధ పరిశోధన గురుంచి వివరించారు.  వైస్- చైర్ పర్సన్ డాక్టర్ వి మునిరాజు నాయుడు ఫాగ్ సాంకేతి గురించి వివరించారు.

కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి వి నరసింహులు,  ఎఐఎమ్ఎల్ విభాగధిపతి ప్రొఫెసర్ ఆర్  మదన మోహన , సీనియర్ ప్రొఫెసర్ వై రామ దేవి పాల్గొన్నారు.  కళాశాల ప్రిన్సిపాల్ చేతుల మీదుగా చాప్టర్ లోగో ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సిబిఐటి కళాశాలో  పది  జాతీయ మరియు అంతర్జాతీయ ప్రొఫెషనల్ బాడీలను వున్నాయి  వాటితో వివిధ విభాగాలు అనుబంధించబడ్డాయి మరియు  విద్యార్థులు మరియు అధ్యాపకుల ప్రయోజనం కోసం విద్యార్థి-చాఫ్టర్లు   ఏర్పాటు చేసాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

లాక్ డౌన్ ఉన్నా కొనసాగిన తబ్లీఘ్-ఈ-జమాత్‌ సదస్సు

Satyam NEWS

థ్యాంక్స్ టు కేసీఆర్: మహానగరానికి నిధుల పంట

Satyam NEWS

న్యూ స్లోగన్: భారీ ఎత్తున ఇంటింటికి అమరావతి ప్రచారం

Satyam NEWS

Leave a Comment