31.7 C
Hyderabad
May 7, 2024 00: 52 AM
Slider నల్గొండ

సూర్యాపేట జిల్లాలో సదరన్ క్యాంపులు నిర్వహించాలి

#hujurnagar congress

దివ్యాంగుల సదరన్ క్యాంపులకు వెళ్లడానికి మీ సేవ కేంద్రాలలో స్లాట్ బుకింగ్ గడువుని పెంచాలని . టి.పి.సి.సి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఎండీ.అజీజ్ పాషా డిమాండ్ చేశారు. కేవలం ఒక్క రోజులో రెండు గంటలు మాత్రమే సైట్ నందు స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఇస్తూ వెంటనే వెబ్ సైట్ట్ ఆఫ్ చేస్తున్నారని, దీనితో సమయం సరిపోక స్లాట్ బుక్ చేసుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని,జిల్లా లోని అన్ని మండలాల యం.పి.డి.ఓ లకు,మున్సిపల్ కమిషనర్లకు నేటి నుండి ఫలానా టైమ్ వరకు స్లాట్ బుక్ చేసుకోగలరని  అధికారులు ప్రకటన జారీ చేయాలని అజీజ్ పాషా కోరారు.

డిఆర్.డివో. పి.డి సుందరి కిరణ్ కుమార్ వినతిపత్రం అందజేసిన పిదప అజీజ్ పాషా మాట్లాడుతూ కరోనా కష్ట సమయంలో అంగవైకల్యం కలిగిన దివ్యాంగులకు సూర్యాపేట జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో తేదీల వారీగా విడివిడిగా కేంద్రాల్లో మెడికల్ సదరన్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరారు.ఈ సందర్భంగా మంగళవారం  జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని డి.ఆర్. డి.ఓ పిడి సుందరి కిరణ్ కుమార్ కు  వినతి పత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా యండి.అజీజ్ పాషా   మాట్లాడుతూ అన్ని రకాల అంగవైకల్యం కలిగిన  దివ్యాంగులకు జిల్లా కేంద్రానికి వచ్చి మెడికల్ సదరన్ క్యాంపులో పాల్గొనడానికి,వచ్చి వెళ్ళాలంటే కరోనా భయంతో,రాక పోకలకు ప్రయాణ భారం ఆర్థిక ఇబ్బందితొ పాటు భౌతికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని అన్నారు.దివ్యాంగులు స్లాట్ బుక్ చేసుకోవటానికి అన్ని మండలాల యం.పి.డి.ఓ లకు,మున్సిపల్ కమిషనర్లకు తమ ద్వారా ప్రకటన చేస్తూ వెబ్ సైట్ నందు గడువు పెంచుతూ నిర్ధిష్టమైన తేదీలు నిర్ణయించి  స్లాట్ బుక్ చేసుకునే విధంగా అధికారులకు ప్రకటన చేస్తూ ఆదేశాలు జారీ చేయాలి కోరారు.

గతంలో పెండింగ్లో ఉన్న సదరన్ సర్టిఫికెట్లు కూడా రాక ప్రభుత్వం ఇచ్చే వివిధ సంక్షేమ పథకాలకు  దూరం అవుతున్నారని,మానసికంగా అనేక ఇబ్బందులను దివ్యాంగులు ఎదుర్కొంటున్నారని,అన్ని రకాల అంగవైకల్యం కలిగిన దివ్యాంగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇట్టి  విషయంపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యను వెంటనే  ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి,జిల్లా పరిధిలోని  అన్ని నియోజకవర్గ కేంద్రాలలో కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ  ప్రత్యేక మెడికల్ సదరన్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, పెండింగ్ లో ఉన్న సదరన్ సర్టిఫికెట్లు వెంటనే ఇచ్చేందుకు అధికారులకు తగు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్.కె.బిక్కన్ సాబ్, దొంతగాని జగన్,ముషం సత్యనారాయణ,కోటేశ్వర్రావు,   తదితరులు పాల్గొన్నారు.

Related posts

అభివృద్ధికి అందరు అధికారులు సహకరించాలి

Satyam NEWS

త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారం

Satyam NEWS

ప్రియసఖుడు

Satyam NEWS

Leave a Comment