36.2 C
Hyderabad
April 27, 2024 22: 34 PM
Slider కవి ప్రపంచం

ప్రియసఖుడు

#Devalapally Sunanda

అనుకోని అతిథిలా వచ్చి

కళ్లెదురుగా నిలుచుంటే

కనురెప్పయినా వాల్చకుండా

చిత్తరువులా నిల్చుండిపోయా

ఆలోచనలన్నీ ఘనీభవించగా

కళ్ళముందు నిలిచిన నిజాన్ని

మనసు ఒప్పుకోనంటుంటే

శిలలా నిల్చుండిపోయా

శిలని శిల్పంగా మారుస్తానని

చిత్తరువుకు  చిరునవ్వులు జోడిస్తానని

చేతిలో చేయి వేసి ప్రమాణం చేస్తానంటూ

నా చేయందుకున్నాడు

అతిధిగా వచ్చి ఆత్మీయుడిగా మారి

నీ ఆత్మ నాదేనంటూ

నా బంధాలు బంధనాలన్నీ మరపించేసి

ఆత్మబంధువుగా మారాడు

వేలుపట్టి నడిపిస్తూ

అనంత లోకానికి తీసుకెళ్తున్నాడు

దేవలపల్లి సునంద

Related posts

రోడ్డు పై కూర్చొని నిరసన తెలియజేస్తున్న చంద్రబాబు

Satyam NEWS

భారత సైనికులకు ప్రాణాంతకంగా మారిన మంచు కొండ చరియలు

Satyam NEWS

ఎల్లో నేతలే కాదు… ఇప్పుడు బ్లూ నేతలూ గగ్గోలు పెడుతున్నారు

Satyam NEWS

Leave a Comment