27.7 C
Hyderabad
May 11, 2024 07: 55 AM
Slider వరంగల్

కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చి ఉచిత వైద్యం అందించాలి

#mulugu cong

రాష్ట్ర ప్రభుత్వం కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చి ఉచిత వైద్యం అందించాలని  కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మంగళవారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండల లింగాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమార్ స్వామి  కరోనాతో బాధపడుతున్న 23  కుటుంబాలకు నిత్యావసర సరుకులు,  మెడికల్ కిట్లు అందించారు.   ఈ సందర్భంగా కుమారస్వామి  మాట్లాడుతూ  ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు మెడికల్ కిట్లు నిత్యావసర సరుకులు అందజేసినట్లు ఆయన తెలిపారు.

కరోనా వల్ల రోజువారీ కూలి పనులు చేసుకుంటూ బ్రతికే వారి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని అందుకే 23 కుటుంబాలకు  నెలకి సరిపడ నిత్యావసర సరుకులు, బియ్యం, పప్పులు, వంట నూనె, కూరగాయలు, సబ్బులు, వైద్యానికి సరిపడా కరోనా మెడికల్ కిట్లు  అందించినట్లు ఆయన తెలిపారు .

కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చి ఉచిత వైద్యం అందించాలనినీ ములుగు శాసన సభ్యురాలు సీతక్క  అధికార పార్టీ నాయకులకు  పలుమార్లు కోరడం జరిగిందని, కనీసంగా తెరాస పార్టీ స్పందించలేదని, ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం  కరోనా ను ఆరోగ్య శ్రీ లో ఉచితంగా వైద్యం అందించాలని   డిమాండ్ చేశారు

ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, వెంకటాపూర్ ఎంపీటీసీ రవి, యూత్ కాంగ్రెస్ సెక్రటరీ కోటి, ములుగు ఎంపీటీసీ మావూరపు తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీటీసీ కంబాల రవి  తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఈ నెల 30 నుంచి శ్రీ శేష దాసుల ఆరాధనోత్సవాలు

Satyam NEWS

హుజూర్ నగర్ లో తెలుగుదేశం పార్టీ ప్రచార రథాలు ప్రారంభం

Satyam NEWS

తెలంగాణలో రేపటి నుంచే స్కూళ్లు, కాలేజీలు

Satyam NEWS

Leave a Comment