29.7 C
Hyderabad
May 4, 2024 05: 33 AM
Slider ప్రత్యేకం

తెలంగాణ లోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలి

#bandisainjai

తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలైన నడిగడ్డ (గద్వాల, ఆలంపూర్), కొడంగల్, జహీరాబాద్, నారాయణఖేడ్, తాండూరు, వికారాబాద్ ప్రాంతాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయవాది పూజారి శ్రీధర్ కోరారు.

ఈ మేరకు ఆయన ఒక వినతి పత్రాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కి అందచేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 J ప్రకారం పాత హైదరాబాద్‌ సంస్థానంలోని ఈ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

హైదరాబాద్ రాష్ట్రం విభజన సమయంలో కొన్ని ప్రాంతాలు కర్నాటకకు వెళ్లాయని, నడిగడ్డ తదితర ప్రాంతాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చాయని ఆయన తెలిపారు. అయితే ఈ ప్రాంతాలు ఆ నాటి నుంచి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నాయని ఆయన తెలిపారు.

అందుకోసం నడిగడ్డ, కొడంగల్, జహీరాబాద్, నారాయణఖేడ్, తాండూరు వికారాబాద్‌లకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన కోరారు. హైదరాబాద్ రాష్ట్రం విభజన సమయంలో కర్నాటకకు వెళ్లిన గుల్బర్గా, బీదర్, రాయచూర్, కొప్పల్, యాద్గిర్, బళ్లారి జిల్లాలకు ప్రత్యేక హోదాను కల్పించి అభివృద్ధి పరుస్తున్నారని ఆయన గుర్తు చేశారు.

ఆర్థికాభివృద్ధి, నీటిపారుదల సౌకర్యాలు, వ్యవసాయాభివృద్ధి, నీటి కేటాయింపులు, విద్యుత్ పంపిణీలో అసమతుల్యత వంటి అంశాల కారణంగా ఈ ప్రాంతాలు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల కేటగిరీ కిందకు వస్తాయి. గతంలో భాషా ప్రాతిపదికన ఆంధ్ర ప్రదేశ్‌లో విలీనమైన తర్వాత కొన్ని రాజ్యాంగ పరంగా ప్రయోజనాలు పొందాల్సి ఉన్నప్పటికి కల్పించలేదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల్ జిల్లా కు చెందిన న్యాయవాదులు శ్రీనిత పూజారి, శ్రీలేఖ పూజారి కూడా పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

మూడ్రోజులపాటు తెలంగాణలో ప్రియాంక పర్యటన

Satyam NEWS

హైదరాబాద్‌లో ఏడీపీ ఇండియా 23 వ వార్షికోత్సవం

Satyam NEWS

కర్నాటక ఎన్నికలు: అన్ని పార్టీలకు టెన్షనే

Satyam NEWS

Leave a Comment