39.2 C
Hyderabad
May 3, 2024 11: 09 AM
Slider హైదరాబాద్

ఈ నెల 20న కూకట్ పల్లి రామాలయం పున:ప్రతిష్ట

#kukatpally

ఈనెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు హైదరాబాద్ కూకట్ పల్లి రామాలయం పున: ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించబోతున్నారు. కూకట్ పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణా రావు, ఇతర దాతల సహకారంతో నిర్వహించే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ పున ప్రతిష్ట మహోత్సవాల కర పత్రాలను నేడు ఆవిష్కరించారు.

బాగ్ అమీర్ శ్రీ బాలాంజనేయ స్వామి టెంపుల్, సుమిత్ర నగర్ కనక దుర్గ టెంపుల్, సప్తగిరి కాలనీ హనుమాన్ టెంపుల్, ఆల్విన్ కాలనీ ఫేస్-1 అమ్మవారి టెంపుల్, వెంకటేశ్వర నగర్ 33బ్లాక్ హనుమాన్ టెంపుల్, 34బ్లాక్ సంతోషి మాత టెంపుల్, పి.జె.ఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర హనుమాన్ టెంపుల్, వెంకటేశ్వర నగర్ వీకర్ సెక్షన్ హనుమాన్ టెంపుల్ లో అర్చకులకు ఆ కరపత్రాలను అందచేశారు. అమ్మవారి,స్వామి వారి దగ్గర ఈ కరపత్రాలను ఉంచి అర్చన చేసిన అనంతరం ఆలయ కమిటీ సభ్యులకు కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు అందచేశారు.

ఈ సందర్బంగా కార్పొరేటర్ రోజా దేవి  మాట్లాడుతూ… ఈనెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరిగే శ్రీ సీతా రామ చంద్ర స్వామి వారి ఆలయ పున:ప్రతిష్ట కార్యక్రమానికి డివిజన్లో ఉన్న ఆలయాల అర్చకులు,ఆలయాల కమిటీల సభ్యులు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అన్నారు.

అదేవిధంగా 20వ తారీకు ఉదయం 7:00 గంటలకుశ్రీ సీతారామచంద్ర స్వామి వారి శోభాయాత్ర 25 తారీకు ఉదయం 10:25 కు శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి వారి కరకమలములచే ప్రాణ ప్రతిష్ట,కుంభ ప్రోక్షణ, సాయంత్రం 6 గంటలకు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతాయి. 26వ తారీకు ఉదయం 10 గంటలకు శ్రీ శ్రీ సీతారామచంద్ర పట్టాభిషేకం నిర్వహించబడుతుంది. కావున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా  కార్యక్రమంలో పాల్గొనాలని భగవంతుని అనుగ్రహాన్ని  పొందాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు,ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

వేద పాఠశాలలో రెపరెప లాడిన మువ్వన్నెల జాతీయ జెండా

Satyam NEWS

వ్యాలెంటైన్స్ డే సందర్భంగా ఫ్యాషన్ షో

Satyam NEWS

పెద్దమందడి పోలీస్ స్టేషన్ యస్.ఐ.కి ఛార్జ్ మెమో

Satyam NEWS

Leave a Comment