32.2 C
Hyderabad
May 8, 2024 11: 50 AM
Slider మహబూబ్ నగర్

యూత్ డే సందర్భంగా ఆటల పోటీలు

#National Youth Day

కమ్యూనిటి పోలీసింగ్ లో భాగంగా జాతీయ యూత్ డే (స్వామి వివేకానంద జయంతి ,జనవరి -12 ) ను పురస్కరించుకొని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువతకు మండల స్థాయిలో, జిల్లా స్థాయి లో క్రికెట్, వాలీబాల్ అథ్లెటిక్స్ 100, 200, 800 మీటర్స్ రన్నింగ్, లాంగ్ జంప్ క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జోగుళాoబ గద్వాల్ జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ తెలిపారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువతకు జిల్లా లోని అన్ని మండలాల స్థాయిలో, జిల్లా స్థాయిలో క్రికెట్, వాలీబాల్, అథ్లెటిక్స్ 100 మీటర్స్, 200 మీటర్స్, 800 మీటర్స్ రన్నింగ్ , లాంగ్ జంప్, పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు అలాగే పోలీస్ జాబ్ లకు ప్రిపేర్ అయ్యే యువతకు ఉపయోగపడే విధంగా పై అథ్లెటిక్స్ పోటిలతో పాటు క్రికెట్ , వాలీబాల్ పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుందని ఆయా గ్రామాలలో ఉండే యువత ఈ ఈవెంట్స్ లలో పాల్గొనదల్చిన వారు సంబంధిత పోలీస్ పోలీస్ స్టేషన్ లలో 8వ తేది లోపు పేరు నమోదు చేసుకొని మండల స్ధాయిలో పాల్గొనాలని అన్నారు.

ఈవెంట్స్ లలో మండల స్థాయి లో మొదటి స్థానం లో నిలిచిన వారు మాత్రమే జిల్లా స్థాయిలో పోటీలలో పాల్గొనడానికి అర్హత పొందుతారని, వాలీబాల్ మాత్రం జిల్లా లో ఉన్న గద్వాల్, అలంపూర్, శాంతి నగర్ సర్కిల్ లలో ఒక్కో సర్కిల్ నుండి A టీం, B టీం లను ఫైనల్ చేసి జిల్లా స్థాయికి పంపడం జరుగుతుందనీ, క్రికెట్ కు సంబందించి ఒక్కో సర్కిల్ నుండి ఒక్కో టీం ను ఫైనల్ చేసి జిల్లా స్థాయి పోటీలకు పంపడం జరుగుతుందనీ, ఫైనల్ లో జిల్లా స్థాయిలో నిర్వహించి మొదటి, రెండు స్థానాలను ఎంపిక చేయడం జరుగుతుందని గెలుపొందిన యువతకు బహుమతులుగా స్పోర్ట్స్ కిట్స్ అందజేయడం జరుగుతుందని ఎస్పీ గారు తెలిపారు. ఈ ఈవెంట్స్ లలో పాల్గొనేందుకు ఆసక్తి గల యువత సంబంధిత పోలీస్ స్టేషన్ లో తమ వివరాలు జనవరి 8వ తేది సాయంత్రము లోపు నమోదు చేసుకొని క్రీడా పోటీలలో పాల్గొనాలని ఎస్పీ గారు తెలిపారు.

ఇతర వివరాలకై సంప్రదించాల్సిన ఫోన్ నెం +917659947007 రిజర్వ్ ఇన్స్పెక్టర్

Related posts

బంగాళాఖాతంలో అల్పపీడనం

Murali Krishna

అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యతిరేకుల పైన రాజద్రోహం కేసు పెట్టాలి

Satyam NEWS

పంట నీరు వృధా అవుతున్నా పట్టించుకోవడం లేదు

Satyam NEWS

Leave a Comment