29.7 C
Hyderabad
April 29, 2024 08: 08 AM
Slider ముఖ్యంశాలు

అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యతిరేకుల పైన రాజద్రోహం కేసు పెట్టాలి

#malamahanadu

తెలంగాణ మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశం మహబూబ్ నగర్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గుంత లక్ష్మయ్య అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సింహయ్య మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును కోనసీమ జిల్లాకు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కోనసీమ జిల్లా సాధన సమితి సభ్యులు మంత్రి విశ్వరూప్ ఇంటిని, ఎమ్మెల్యే సతీష్ ఇంటిని తగలబెట్టిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు

అంతే కాకుండా ప్రభుత్వ ఆస్తులను, బస్సులను తగలపెట్టడాన్ని తెలంగాణ మాల మహానాడుగా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా వివిధ జిల్లాలకు, అల్లూరి సీతారామరాజు, ఎన్టీ రామారావు, వైయస్సార్,  సత్య సాయి బాబా, అన్నమయ్య పేర్లను పెడితే ఎవరు వ్యతిరేకించలేదు కానీ ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు కోనసీమ జిల్లాకు ఏర్పాటు చేస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు.

వారంతా అంబేద్కర్ కన్న గొప్ప వారా అని ప్రశ్నించారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ కుల జాడ్యం పట్టిపీడిస్తోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు అన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వైపు చూస్తుంటే మతోన్మాదులు కుల పిచ్చి తో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును కోనసీమ జిల్లాకు ఏర్పాటు చేస్తే జీర్ణించుకోలేక  అరాచకాలు సృష్టిస్తున్నారని ధ్వజ మెత్తారు.

కోనసీమ జిల్లా సాధన సమితి వెనుక ఉన్న రాజకీయ శక్తులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే బయటికి తీసుకొచ్చి కఠినంగా శిక్షించాలి అన్నారు. అంబేద్కర్ పేరును వ్యతిరేకిస్తున్నా మతోన్మాదుల పైన దేశద్రోహం కేసు పెట్టాలన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాను యథాతథంగా కొనసాగించాలని అన్నారు.  అంబేద్కర్ వ్యతిరేకులు ఎంతటి వారైనా సహించేది లేదని హెచ్చరించారు.

ఖబర్దార్ అంబేద్కర్ వ్యతిరేకులు లారా కుల పిచ్చి తో అంబేద్కర్ ని, అంబేద్కర్ వారసులనివ్యతిరేకిస్తే మా ఆగ్రహజ్వాలలు మాడి మసై పోతారని హెచ్చరించారు. ఇప్పటికైనా మీ ఆలోచన విధానాన్ని మార్చుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనియెడల డాక్టర్ కారెం శివాజీ నాయకత్వంలో అన్ని రాష్ట్రాల్లోని మిత్రులంతా ఏకం చేసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు మంత్రి చెన్నకేశవులు, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు గుంత లక్ష్మయ్య, జిల్లా ఉపాధ్యక్షులు బైండ్ల శ్యాంసుందర్, జిల్లా సహాయ కార్యదర్శి ధర్పల్లి అంజనేయులు, నియోజకవర్గం అధ్యక్షులు తోళ్ల మాసయ్య,నియోజకవర్గ ఉపాధ్యక్షులు సాతర్ల పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

విద్యార్థులకు స్ఫూర్తిని కలిగించే పుస్తకాల వితరణ

Satyam NEWS

డ్రగ్స్ వాడకంపై కఠినంగా వ్యవహరించండి

Satyam NEWS

రాధికా కుమారస్వామి సమర్పణలో ‘లక్కీ స్టార్’గా వస్తున్న పాన్ ఇండియా స్టార్ యష్

Satyam NEWS

Leave a Comment