37.7 C
Hyderabad
May 4, 2024 11: 40 AM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ లో ముదిరాజ్ సంఘ భవనం కూల్చివేతపై స్టే

#mudirajbuilding

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని  ముదిరాజ్ సంఘ భవనం కూల్చివేతపై మునిసిపల్ వ్యవహారాల శాఖ కార్యదర్శి స్టే మంజూరు చేశారు. కొన్ని సంవత్సరాల నుండి ముదిరాజ్ సంఘ స్థలం పై వివాదం జరుగుతున్నది. గతంలో కొల్లాపూర్ రాజా వారి బంగ్లా పక్కల  స్థలాన్ని కొన్నట్లు ముదిరాజ్ సంఘం సభ్యులు చెబుతూ వచ్చారు.

ఇప్పుడు ఆ స్థలం కోట్ల రూపాయల విలువ చేస్తుంది. అయితే ఆ స్థలం వారికి అమ్మలేదని  వారికి సంబంధించిన స్థలం వేరే దగ్గర ఉందని వాదనలు జరుగుతున్నాయి. దీనితో గత ఏడాదిన్నర క్రితం సంఘం సభ్యులు రాజా బగ్ల పక్కల  స్థలంలో కాంపౌండ్ నిర్మించారు. అయితే దాన్ని కూల్చి వేశారు.

అవి పోలీస్ ఫిర్యాదు వరకు వెళ్ళింది. జాతీయ మానవ హక్కుల సంఘానికి స్థానిక ఎమ్మెల్యే పేరు తో సహా కొంత మందిపై ఆ సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆ సంఘంలో రాజకీయ వర్గాలు ఎక్కువగా ఉన్నాయి. కొందరు అందులోనే రాజకీయ వర్గాలుగా ఉన్నారు. ఏదేమైనా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అక్కడే అందరూ కలిసి కంపౌండ్ నిర్మించారు. లోపల ఒక రేకుల షేడ్ కూడా వేశారు.

అప్పట్లలో ఆ కాంపౌండ్ ను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. కొన్ని నెలల క్రితం కొల్లాపూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో అక్రమంగా నిర్మాణం చేసిన ఎన్టీఆర్ చౌరస్థలోని విక్రమ్ గౌడ్  బిల్డింగ్ తో పాటు ముదిరాజ్ సంఘం కాంపౌండ్   పై కూడా కూల్చివేత ఆదేశాలు వచ్చాయి. విక్రమ్ గౌడ్ బిల్డింగ్ ను కూల్చ లేదు కానీ  హోల్స్ వేశారు. ఇది అందరికీ తెలిసిందే. ముదిరాజ్ కుల సంఘానికి సంబంధించింది కాబట్టి కూల్చకుండా స్థానిక ఎమ్మెల్యే అడ్డుకున్నట్లు ప్రచారం జరిగింది.

అయితే ఏం జరిగిందో ఏమో కానీ కొల్లాపూర్ రాజా బంగ్లా  పక్కల ముదిరాజ్ సంఘ సభ్యులు నిర్మాణం చేసుకున్న కాంపౌండ్ ను లోపల వేసుకున్న రేకుల రూమ్ ను గత నెల 27 తెల్లవారుజామున జిల్లా టాస్క్ఫోర్స్ అధికారులు కూల్చివేశారు. అయితే ఎమ్మెల్యే కూడా ఇదే సమయంలో  విదేశాలకు వెళ్లారు.

ఆయన లేని సమయంలో కూల్చి వేత్త జరగడం  గమనార్హం. మున్సిపల్ కమిషనర్ కు  కూడా  సమాచారం లేకుండా గుట్టు చప్పుడు కాకుండా రాత్రికి రాత్రి వచ్చిన ఆదేశాలతో టాస్క్ఫోర్స్ అధికారుల ఆధ్వర్యంలో కూల్చివేసినట్లు తెలుస్తోంది. దీనిపై ముదిరాజ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ సొసైటీ ప్రధాన కార్యదర్శి టి కుమార స్వామి అప్పీలుకు వెళ్లారు.

ఆయన దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను పరిశీలించిన రాష్ట్ర మునిసిపల్ వ్యవహారాల కార్యదర్శి స్టే మంజూరు చేశారు. ఈ భవనం కూల్చివేతపై 2021 నవంబర్ 15న కొల్లాపూర్ మునిసిపల్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను, ఆర్ డి ఎం ఏ ఈ ఏడాది మే 23న ఇచ్చిన రెండు ఉత్తర్వులపైనా కూడా ఆయన స్టే మంజూరు చేశారు. మునిసిపల్ విభాగం డైరెక్టర్ ఈ అంశంపై విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకోవాలని కూడా ఆదేశాలలో పేర్కొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

శ్రీవాణి టికెట్ల కోటా రోజుకు 1000కి పరిమితం

Bhavani

పాత చట్టాలను మార్చేస్తున్నాం

Satyam NEWS

సమాచార హక్కు చట్టం కన్వీనర్ గా చపర్తిరాజు

Satyam NEWS

Leave a Comment